ఆటలపై ఆశక్తి ఉంటే సరిపోదు. గెలవాలనే పట్టుదల ఉండాలి

 ఆటలపై ఆశక్తి ఉంటే సరిపోదు. గెలవాలనే పట్టుదల ఉండాలి


.


రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడిపరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు.



అసలు సిసలు క్రీడా దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్.


మేజర్ ధ్యాన్ చంద్ విగ్రహం ఆవిష్కరించిన మంత్రి.


పలాస (ప్రజా అమరావతి).


ఆటలపై ఆశక్తి ఉంటే సరిపోదు గెకవాలనే పట్టదలతో ఆటలు ఆడాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడిపరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. కాశీబుగ్గ హైస్కూల్ లో ప్రముఖ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ర విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటల్లో గెలుపు ఓటమి అనేది సహజం కానీ గెలవాలనే లక్ష్యం నిర్ధేశించుకుని ఆటలు ఆడాలని  తెలిపారు. క్రీడలు కూడా మనిషి జీవితంలో ఒక భాగం మారుతుంటాయి. హాకీ క్రీడలలో విభిన్న ప్రతిభను చూపించిన వ్యక్తి మేజర్ ధ్యాన్ చంద్. మీ అందరికి తెలుసో లేదో  1936 ఒలింపిక్స్ గేమ్స్ హకీ ఫైనల్లో మ్యాచ్ లో  ఓ భారత ఆటగాడు తన హాకీ స్టిక్ కి ఏదో అయస్కాంత శక్తిని ఆపాదించినట్లుగా మ్యాచ్ మొత్తం బంతిని తన ఆధీనంలోనే ఉంచుకున్నాడు. ఇంతలో అనుమానం వచ్చిన నెదర్లాండ్ హీకీ అథారిటీస్ వారు ఆ వ్యక్తి హాకీ స్టిక్ ని సునిశితంగా పరిశీలించారు. ఆ స్టిక్ నిబంధనలకు అనుగుణంగానే ఉంది. అయిన అందులో ఏదైన అయస్కాంత శక్తి ఉందోమోనన్న అనుమానంతో ఆ స్టిక్ ని విరగొట్టి మరో కొత్త స్టిక్ అతనికిచ్చారు. కాని అతడు మునపటికన్న ఎక్కువ జోరుతో గోల్ ఫోస్టుపై దాడి చేశాడు. ఆయన ఆట తీరులో అంత ఈజ్‌ ఉండేది. ఫలితంగా భారత్ గోల్డ్ మెడల్ సాధించింది. ఇంతకి ఆ ఆటగాడు ఎవరో మీకిప్పటికి అర్థమయి ఉంటుంది అని మంత్రి తెలిపారు. అతడే భారత క్రీడా ప్రపంచంలోనే దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్. మన దేశానికి ఒలింపిక్స్ నందు హాకీ క్రీడలో బంగారు పతకాలను గెలుచుకొనివచ్చి, హాకీని జాతీయ క్రీడగా అభివృద్ధి చేసేందుకు విశేషంగా కృషి చేసిన వారిలో ముఖ్యలు మేజర్ ధ్యాన్‌చంద్ అంటూ చెప్పారు.


1905, ఆగస్టు 29 ఉత్తర్ ప్రదేశ్ లోని అలహాబాద్ లో జన్మించిన ధ్యాన్ చంద్ భారత జట్టు మూడు సార్లు ఒలింపిక్ మెడల్ తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించారని అన్నారు. ధ్యాన్ చంద్ నేతృత్వంలోనే మన దేశం వరుసగా మూడుసార్లు ఒలింపిక్స్‌లో స్వర్ణపతకాలు సాధించింది. 1928లో ఆమ్‌స్టర్‌డ్యామ్‌, 1932లో లాస్‌ఏంజెల్స్, 1936లో బెర్లిన్‌లో విజయాలు సొంతం చేసుకుందని చెప్పారు. దీంతో ధ్యాన్‌చంద్‌ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయిందన్నారు. ద్యాన్ చంద్ తర్వాత 1948, 1952, 1956 వరకు ఒలింపిక్స్‌లో భారత జట్టు వరుస విజయాలు సాధించిందని తెలిపారు. 1964లో ఫైనల్స్‌లో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా గెలిచిందని. 1968లో పశ్చిమ జర్మనీని ఓడించి కాంస్య పతకం గెలుచుకుందని అన్నారు. 1972లో నెదర్లాండ్స్‌ను ఓడించి, కాంస్యం గెలుచుకుని మూడోస్థానంలో నిలబడేలా ధ్యాన్ చంద్ ప్రతిభ కనబరిచారని అన్నారు. 1980 ఒలింపిక్స్‌లో మాస్కోలో ఆఖరుసారి స్పెయిన్‌ను ఓడించి బంగారు పతకం సాధించేలా క్రీడా ప్రతిభను కనబర్చిన గొప్ప క్రీడాకారుడని మంత్రి తెలిపారు. ధ్యాన్ చంద్ జర్మనీ దేశంపై మూడు వరుస గోల్స్ చేసి 8-1 తేడాతో గెలిచేలా చేసి ఒక ఒలంపిక్ పతాకాన్ని దేశానికి అందించాడని అన్నారు. 


1956లో తన 16వ యేట మేజర్ ధ్యాన్ చంద్ భారత ఆర్మీలో చేరారు. 2014లో భారత రత్న పురస్కారం కోసం నామినేట్ అయిన వారిలో ధ్యాన్ చంద్ కూడా ఉన్నారు. అయితే దురదృష్టవశాత్తు ఆయనకు  దేశ అత్యున్నత పౌరపురస్కారం దక్కలేదు.  ఇన్నాళ్లకు ధ్యాన్ చంద్ పేరుతో ఖేల్ రత్నం అవార్డులను ప్రధానం చేయనున్నట్లు భాతర ప్రభుత్వం ప్రకటించిందని ఇది మేజర్ ధ్యాన్ చంద్ హాకీ క్రీడల్లో  ఆయన కష్టానికి గౌరవం దక్కించినట్లు అన్నారు. కాశీబుగ్గ హైస్కూల్ లో మేజర్ ధ్యాన్ చంద్ విగ్రహం నెలకొల్పడం వలన విద్యార్ధులకు క్రీడల పట్ల ఆశక్తి పరుగుతుందని అన్నారు. ప్రతి ఒక్కరు క్రీడల్లో తమదైన శైలి చూపిస్తూ దేశ, రాష్ట్ర గౌరవాన్ని పెంచాలని కోరారు.

Comments