స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ఆకట్టుకున్న శకటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శన శాలలు.

 స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ఆకట్టుకున్న శకటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శన శాలలు*


అనంతపురం, ఆగస్టు 15 (ప్రజా అమరావతి) :


*నగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో ఆదివారం ఉదయం 75 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన శకటాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇందులో పోలీసు శాఖ ఆధ్వర్యంలో దిశా, జన వనరుల శాఖ, గృహ నిర్మాణ శాఖ,  వైద్య ఆరోగ్య శాఖ, వ్యవసాయ శాఖ, విద్య, పంచాయతీరాజ్ మరియు అగ్నిమాపక శాఖకు చెందిన శకటాలను ఆయా శాఖ అధికారులు ఏర్పాటు చేయగా అవి ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇందులో ప్రథమ స్థానాన్ని వైద్య ఆరోగ్య శాఖకు దక్కింది. పంచాయతీరాజ్ రెండోస్థానం, గృహ నిర్మాణ శాఖ మూడవ స్థానంగా ఎంపికయింది. ఈ సందర్భంగా రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ ఆయా శాఖ అధికారులను సిబ్బందిని అభినందిస్తూ బహుమతులు ప్రధానం చేశారు.*  


*అలాగే దేశభక్తిని పెంపొందించే విధంగా ఆకట్టుకుని అలరించిన కేజీబీవీ కూడేరు, కేజీబీవీ కురుగుంట, కెజిబివి గార్లదిన్నె, కేజీబీవీ బుక్కరాయసముద్రం విద్యార్థినీలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో పాల్గొన్న విద్యార్థినిలకు మంత్రి అభినందనలు తెలియజేస్తూ బహుమతులను ప్రధానం చేశారు. అనంతరం వైద్య ఆరోగ్య శాఖ, వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, చేనేత మరియు జౌళి శాఖ, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, మహిళా శిశు సంక్షేమం, మత్స్యశాఖ, ఎస్సీ , ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు మరియు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఆయా శాఖల ద్వారా జరుగుతున్న అభివృద్ధి పై ఏర్పాటు చేసిన ప్రదర్శన శాలలను (స్టాల్స్)   మంత్రివర్యులు,జిల్లాకలెక్టర్,  జిల్లా ఎస్పీ , పలువురు ప్రజా ప్రతినిధులు, జాయింట్ కలెక్టర్లు తదితరులు సందర్శించారు. ఈ సందర్భంగా బిసి కార్పొరేషన్ ఎన్బిసిఎఫ్డిసి పథకం ద్వారా ఇద్దరికీ రూ. 64.21 లక్షల వ్యయంతో రెండు ఇన్నోవా కార్లను లబ్ధిదారులకు మంత్రి చేతుల మీదుగా అందజేశారు. అలాగే పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో కందుకూరు అమ్మవారిపేట పాడి రైతులకు, ఇస్కాన్ గోశాలకు ఒక్కొక్కరికి పది లీటర్ల పాలక్యాన్లను మంత్రి పంపిణీ చేశారు. ఉత్తమ సేవలు అందించిన వారికి అవార్డుల ప్రధానం సంబంధించి 475  మంది ఎంపిక కాగా, కోవిడ్ కారణంగా పరిమిత సంఖ్యలో అవార్డుల ప్రదానం జరిగింది. ఈ కార్యక్రమంలో

జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి)ఏ.సిరి, జాయింట్ కలెక్టర్ ( ఆసరా) గంగాధర్ గౌడ్, హౌసింగ్ జాయింట్ కలెక్టర్ నిశాంతి, అసిస్టెంట్ కలెక్టర్ సూర్య తేజ్, సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు---------------------------------------------

సహాయ సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ

Popular posts
భారీ గజమాలతో సత్కరించిన అభిమానులు
Image
సంక్షేమ నవశకానికి నాంది నవరత్నాల పథకాలు :
శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ
ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో తీసుకువస్తున్న రిఫార్మ్స్,టెక్నాలజీ వినియోగంలో రాష్ట్రంలోని క్షేత్రస్థాయి అధికారులకు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ట్యాబ్ లను అందజేసిన డి‌జి‌పి గౌతం సవాంగ్ IPS గారు. కార్యక్రమంలో పాల్గొన్న కడప జిల్లా ఎస్పి అన్బురాజన్ IPS .
Image
అక్టోబర్ 30న మెగా జాబ్ మేళా : ఐ.టీ, పరిశ్రమలు , నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
Image