*నల్సా యాప్‌ను ప్రారంభించిన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ*
దిల్లీ (ప్రజా అమరావతి): జాతీయ న్యాయ సేవా కేంద్రం-నల్సా యాప్‌ను సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా న్యాయసేవలు నేరుగా ప్రజలకు చేరువ కానున్నాయి. ఈ సందర్భంగా నల్సా మొబైల్ యాప్ సేవలను జస్టిస్ ఎన్వీ రమణ కొనియాడారు. పోలీస్ స్టేషన్లలో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని సీజేఐ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు రాజ్యాంగపరమైన రక్షణ ఉన్నా వేధింపులు కొనసాగుతున్నాయన్నారు. ఠాణాల్లో ఇప్పటికీ మానవహక్కుల ఉల్లంఘన జరగడం విచారకరమన్నారు. కస్టోడియల్ టార్చర్ సహా పోలీసుల వేధింపులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అంతర్జాలం లేక న్యాయసహాయానికి అవరోధాలు ఏర్పడుతున్నాయని, అంతర్జాల అనుసంధానం మెరుగుపరచాలని కేంద్రానికి లేఖ రాసినట్లు చెప్పారు. కొవిడ్ పరిస్థితుల్లోనూ సమర్ధంగా న్యాయ సేవలు అందించామని సీజేఐ వెల్లడించారు.
addComments
Post a Comment