*ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్ అందించడం అభినందనీయం
*
*: జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్*
*: జిల్లా కలెక్టర్ కి 10 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్ అందించిన ఐసిఐసిఐ ఫౌండేషన్*
అనంతపురం, ఆగస్టు 06 (ప్రజా అమరావతి):
కరోనా నేపథ్యంలో ప్రాణాలు కాపాడేందుకు ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్ ఎంతో ముఖ్యమైనవని, అలాంటి ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్ ను ఐసిఐసిఐ ఫౌండేషన్ తరఫున అందజేయడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ పేర్కొన్నారు. శుక్రవారం అనంతపురం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని సూపరింటెండెంట్ ఛాంబర్లో అనంతపురం ఐసిఐసిఐ ఫౌండేషన్ తరఫున 10 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్ ను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఏ.సిరిలకు అనంతపురం ఐసిఐసిఐ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ మేనేజర్ విశాల అస్హర్, ఐసిఐసిఐ బ్యాంక్ రిలేషన్షిప్ మేనేజర్ హుస్సేన్ లు అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఐసిఐసిఐ ఫౌండేషన్ తరఫున 10 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్ ను అందు చేయడం ఎంతో గొప్ప విషయమన్నారు. ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్ ను అందించడం పట్ల ఐసిఐసిఐ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ మేనేజర్, రిలేషన్షిప్ మేనేజర్ లను అభినందించారు.
అనంతరం ఐసిఐసిఐ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ మేనేజర్ విశాల అస్హర్ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ఐసిఐసిఐ బ్యాంక్ రాష్ట్ర హెడ్ రాజశేఖర్, తిరుపతి రీజనల్ హెడ్ శ్రీనివాసరావు, సేల్స్ రీజనల్ హెడ్ నాగేశ్వరరావు ఆదేశాలతో ఒక్కోటి ఒక లక్ష రూపాయలు విలువ చేసే 10 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్ ను జిల్లా కలెక్టర్ కు అందజేయడం జరిగిందన్నారు. ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్ ఒక్కోటి 5 లీటర్ల సామర్థ్యం కలిగినవని, ముంబాయిలోని ఐసిఐసిఐ ఫౌండేషన్ నుంచి ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్ ను తెప్పించి అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఐసిఐసిఐ బ్యాంక్ ప్రతినిధులు పాల్గొన్నారు.
addComments
Post a Comment