నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తాంః హోం మంత్రి శ్రీమతి సుచరిత.

 

గుంటూరు (ప్రజా అమరావతి);



నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తాంః హోం మంత్రి శ్రీమతి సుచరిత*


రమ్య కుటుంబసభ్యులను పరామర్శించిన హోంమంత్రి. నిందుతుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చిన హోంమంత్రి.

 సీఎం గారు ప్రకటించిన 10 లక్షల రూపాయల చెక్ ను బాధిత కుటుంబానికి అందించిన హోంమంత్రి.

రమ్య మృతికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసిన హోం మినిస్టర్ సుచరిత.

ఈ సందర్భంగా హోం మంత్రి సుచరిత మీడియాతో మాట్లాడుతూ..

బీటెక్ విద్యార్థిని రమ్య హత్య ఘటన అత్యంత బాధాకరం.  సిసి కెమెరా ఫుటేజ్ ఆధారంగానే నిన్నటి ఘటనలో నిందితుడని అరెస్ట్ చేశాం.

 నిందితుడిని ఒక్క రోజుల్లోనే పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది.

 రమ్య కుటుంబసభ్యులకు అన్ని విధాలుగా ప్రభుత్వం తరఫున అండగా ఉంటాం

 గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళల భద్రత విషయంలో ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు.

 బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని ముఖ్యమంత్రిగారు సూచించారు. 

 దిశ చట్టం ఎక్కడుంది.. అంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి.

రాష్ట్రంలో దిశ చట్టానికి సంబంధించి చర్యలు ప్రారంభించిన తర్వాత 58 రోజుల్లోనే మహిళలపై జరిగిన దాడులపై దర్యాప్తు పూర్తి అవుతుంది.

 ప్రత్యేకంగా 18 దిశ పోలీస్ స్టేషన్లలను ఏర్పాటు చేసి.. మహిళలకు రక్షణగా ప్రభుత్వం ఉంది.

అదేవిధంగా తిరుపతి, విశాఖపట్నం, విజయవాడలో లో మూడు FSL ల్యాబ్ లు కూడా త్వరలోనే పూర్తి అవుతున్నాయి.ఎక్కడైనా మహిళలకు అన్యాయం జరిగితే ముఖ్యమంత్రిగారే స్వయంగా స్పందిస్తున్నారు.

 మహిళపై దాడులకు పాల్పడిన ఏ ఒక్క నేరస్థుడిని ఈ ప్రభుత్వం వదిలిపెట్టలేదు. వదిలిపెట్టదు. అంతేకాకుండా, బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసి వారికి అండగా నిలబడుతున్నాము. 

మహిళపై అఘాయిత్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు.తాడేపల్లి ఘటనలో నిందితులను గుర్తించి,  ఒకరిని అరెస్టు చేశాం. 


- పార్లమెంట్ లో దిశ బిల్లు చట్టంగా రూపొందితే ప్రత్యేక న్యాయ స్థానాలు అందుబాటులోకి వస్తాయి.


- మహిళలు సురక్షితంకాని ప్రాంతాలకు వెళ్ళకూడదు. గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసినప్పుడు దిశ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలి.

Comments