శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి (ప్రజా అమరావతి): ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి డి.భ్రమరాంబ
కనకదుర్గ నగర్, మహామండపం క్యూ-లైన్ల ద్వారా శ్రీ అమ్మవారి దర్శనం నకు విచ్చేయు భక్తులకు అందుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఇందులో భాగంగా ప్రతి ఫ్లోర్ లోనూ క్యూ లైన్ లు, శానిటేషన్, టాయిలెట్లు, నీటి వసతి, 5 వ అంతస్తు నందు ఉన్న షాపులు, పరిశీలించారు. పలువురు భక్తులతో స్వయంగా మాట్లాడి, షాపుల యందు వస్తు విక్రయ రేట్లు మరియు వారికి అందుతున్న ఏర్పాట్లు గురించి అభిప్రాయం అడిగి తెలుసుకున్నారు. అనంతరం భక్తులకు మెరుగైన సౌకర్యాల నిమిత్తం ఆలయ ఇంజినీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు.
addComments
Post a Comment