హోం మినిస్టర్ చేతులమీదిగా మిరాకిల్ అవార్డ్స్ అందుకున్న తెనాలి వాసులు

 హోం మినిస్టర్ చేతులమీదిగా మిరాకిల్ అవార్డ్స్ అందుకున్న తెనాలి వాసులు



తెనాలి (ప్రజా అమరావతి): పట్టణానికి చెందిన దర్శకుడు, సీనియర్ జర్నలిస్ట్, వరల్డ్ రికార్డ్ హోల్డర్ కనపర్తి రత్నాకర్, డాక్టర్ కనపర్తి రాగ లతలు  ప్రముఖ రికార్డ్స్ నమోదు సంస్థ మిరాకిల్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ ప్రతిష్టాత్మక పురస్కారాలు మాన్ ఆఫ్ ది మిరకల్, ఉమెన్ ఆఫ్ ది మిరాకిల్ అవార్డులను హోం మినిస్టర్ చేతుల మీదుగా అందుకున్నారు. గుంటూరు లోని హోం మినిస్టర్ క్యాంపు ఆఫీసులో శుక్రవారం అవార్డుల ప్రదాన కార్యక్రమం జరిగింది. పురస్కార గ్రహీతలు రత్నాకర్, డాక్టర్ రాగలతల హోం మినిస్టర్ సుచరిత అభినందించారు. ఈ సందర్భంగా మిరాకిల్ సంస్థ ప్రతినిధి తిమ్మిరి రవీంద్రబాబు మాట్లాడుతూ అద్భుతమైన సాహస ప్రదర్శన చేసినందుకు, 100 సంవత్సరాల క్రితం తెనాలి, పరిసర గ్రామాల్లో జరిగిన స్వాతంత్ర్య పోరాటాన్ని సజీవంగా వీరస్థలి తెనాలి అనే చిత్రాన్ని చిత్రీకరించినదుకు రత్నాకర్ కు మాన్ ఆఫ్ ది మిరాకిల్ అవార్డును, కోవిడ్ సమయంలో వైద్య సేవలు, సామాజిక సేవలు అందించినందుకుంగాను డాక్టర్ రాగ లత కు ఉమెన్ ఆఫ్ ది మిరాకిల్ అవార్డును అందజేసామన్నారు. కార్యక్రమంలో డి.పి.ఆర్.ఓ. జె. శ్యామ్, నేషనల్ ఫెడరేషన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, రాష్ట్ర ఉపాధ్యక్షులు, తిమ్మిరి. భానుచందర్, న్యాయవాది కె. మధుకర్ తదితరాలుపాల్గొన్నారు.

Comments