బైరి సారంగపురం సచివాలయం ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి.
ప్రజా ప్రయోజనాక పనులు పనులు సక్రమంగా జరగాలి.
రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడి పరిశ్రమాభివృధ్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు.
గ్రామ స్థాయి పరిపాలన సక్రమంగా జరగాలి.
పలాస (ప్రజా అమరావతి).
సచివాలయాక ద్వారా ప్రజలకు అన్ని పధకాలు లబ్ధి చేకూరే విధంగా ఉండాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడి పరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు.గురువారం మందస మండలం బైరిసారంగపురం సచివాలయాన్ని రాష్ట్ర మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయాల్లో ప్రజకు సంబందించిన పనులు త్వరిత గతిన జరగాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా సచివాలయ ఉద్యోగాక ద్వారా ప్రజలకు సత్వర సేవలు అందించాలని చూశారని అన్నారు. గ్రామ పరిపాలన జరగాలంటే సచివాలయాలు ఉండాకని కోరుతూ ప్రతి రెండు పంచాయతీ లకు ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేస్తూ గ్రామ పరిపాలనను అందించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఏదైతే ఒక లక్ష్యం తో ప్రారంభించిన సచివాలయ పరిపసలన విభాగం ప్రజలు అందరికి అందాలని కోరారు. దేశంలో ఎక్కడా లేన వదంగా ఒక సచివాలయ వ్యవస్థను గ్రామ,పట్టణ వార్డు స్థాయిల్లో ప్రారంభించి ప్రజలకు చేరువలో ప్రతి ప్రభుత్వ పథకాన్ని అందిస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది జగనన్న ప్రభుత్వం అని అన్నారు. సచివాలయ ఉద్యోగులు ఒక లక్ష్యం తో పని చేయాలని కోరారు.
addComments
Post a Comment