iఆంధ్రప్రదేశ్
ప్రభుత్వం-సమగ్ర శిక్షా
సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో డిప్యూటేషన్ (ఎఫ్.ఎస్.టి.సి.)పై పని చేయడానికి ఆసక్తిగల ప్రధానోపాధ్యాయులు మరియు స్కూల్ అసిస్టెంట్లు నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు శ్రీమతి కె.వెట్రిసెల్వి గారు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యాశాఖ నందు ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్న ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు అర్హులని తెలిపారు. ఆసక్తిగలవారు తమ దరఖాస్తులను సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి లేదా ప్రాంతీయ సంయుక్త సంచాలకుల ద్వారా ఈ నెల 31వ తేదీలోపు పంపాలని కోరారు. అర్హతలు, ఇతర వివరాలు https://cse.ap.gov.in/DSENEW/ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు.
addComments
Post a Comment