కడప జిల్లా.(ప్రజా అమరావతి);
నిరంతరం విధుల్లో ఉండే పోలీసు సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాలి
పోలీసులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించడం అభినందనీయం
అరుణాచల ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్ లో ఉచిత వైద్య శిబిరం ప్రారంభ కార్యక్రమంలో జిల్లా ఎస్.పి శ్రీ కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ గారు
కడప ఆగస్టు 24: నిరంతరం విధుల్లో ఉండే పోలీసు సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించి సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకుని తగిన చికిత్స తీసుకొని సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని జిల్లా ఎస్.పి శ్రీ కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ గారు సూచించారు. మంగళవారం నగరంలోని నాగరాజు పేటలో ఉన్న అరుణాచల ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్ (ఏ.ఐ.ఎం.ఎస్) లో హాస్పిటల్ యాజమాన్యం ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందికి నిర్వహించిన ప్రత్యేక ఉచిత వైద్య పరీక్షల శిబిరాన్ని జిల్లా ఎస్.పి గారు ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్.పి గారు మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పోలీసు సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉంటూ ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పోలీసు సిబ్బందికి ఉచితంగా అత్యాధునిక వైద్య పరీక్షలు నిర్వహించడం అభినందనీయమన్నారు. క్రమం తప్పకుండా బి.పి, బ్లడ్ షుగర్, గుండె, కిడ్నీ సంబంధిత పరీక్షలు చేయించుకోవాలన్నారు. హాస్పిటల్ వ్యవస్థాపకులు, ప్రముఖ హృద్రోగనిపుణులు డా. రెడ్డెప్పగారి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ కోవిడ్ -19 నేపథ్యంలో ప్రాణాంతక వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు జిల్లా ఎస్.పి శ్రీ కే.కే.ఎన్ అన్బురాజన్ నేతృత్వంలో జిల్లాలోని పోలీసు అధికారులు, సిబ్బంది ప్రజల సురక్షితంగా ఉంచేందుకు తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వర్తించారని కొనియాడారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా జిల్లా ఎస్.పి శ్రీ కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ గారు పోలీసు శాఖను జిల్లాలోని ప్రజలకు మరింత చేరువ చేశారన్నారు. ప్రజల బాగోగుల కోసం నిరంతరం విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు తమ వంతు సామాజిక బాధ్యతగా వైద్య పరీక్షలు నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్.పి శ్రీ కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ అరుణాచల ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్ మహిళా సిబ్బందికి 'దిశ' యాప్ ను తప్పనిసరిగా డౌన్ లోడ్ చేసుకోవాలని, ఆపదలో రక్షణ కవచంలా 'దిశ' యాప్ పనిచేస్తుందన్నారు. డా. మమతేశ్వరి (గైనకాలజిస్ట్), డా. భరత్ కుమార్ రెడ్డి (జనరల్ సర్జన్), డా. సాయి సుజిత్ (ఆర్థోపెడిక్) డా. ఉజ్వల (జనరల్ ఫిజీషియన్) డా. రాఘవేంద్ర (అనేస్తేషియా వైద్యులు) పోలీసు సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో ఏ.ఆర్ అదనపు ఎస్.పి ఎం.మహేష్ కుమార్, ఏ.ఆర్ డి.ఎస్.పి రమణయ్య, వన్ టౌన్ సి.ఐ సత్యనారాయణ, ఎస్.బి ఇన్స్పెక్టర్ రాజా ప్రభాకర్, పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు దూలం సురేష్, ఉపాధ్యక్షుడు ఉప్పు శంకర్, కో-ఆప్షన్ సభ్యులు బండారు రామకృష్ణ, ట్రెజరర్ గంగరాజు, హాస్పిటల్ ఏ.ఓ జంగా కోటిరెడ్డి పాల్గొన్నారు.
*జిల్లా పోలీసు కార్యాలయం, కడప*
addComments
Post a Comment