చేనేత మన సంప్రదాయం..వారసత్వం

 




*నైపుణ్యమైన చేనేతల ద్వారా భావితరాలకు శిక్షణ : చేనేత, జౌళి, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి*



*చేనేత మన సంప్రదాయం..వారసత్వం


*


*చేనేతను కాపాడుకోవడం మనందరి బాధ్యత*


*ముచ్చటగా మూడోసారి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటోన్న ముఖ్యమంత్రి*


*జాతీయ చేనేత దినోత్సవ వేడుకలలో పాల్గొన్న మంత్రి గౌతమ్ రెడ్డి*


అమరావతి, ఆగస్ట్, 07 (ప్రజా అమరావతి); "చేనేత మనందరి సంప్రదాయం", "చేనేత ప్రతి ఒక్కరి వారసత్వం" అని చేనేత,జౌళి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భావోద్వేగంగా వెల్లడించారు. "చేనేత ప్రతి ఒక్కరి బాధ్యత" అని ఆయన స్పష్టం చేశారు. నైపుణ్యమున్న చేనేతల ద్వారా భావితరాలకు శిక్షణ అందించేందుకు శ్రీకారం చుడతామని మంత్రి మేకపాటి పేర్కొన్నారు. ఖాదీ, చేనేత, పొందూరు వస్త్ర పరిశ్రమల ద్వారా తయారైన వస్త్రాలను నవతరానికి చేరువ చేస్తామన్నారు. విజయవాడలోని ఆప్కో భవన్ లో 7వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకలలో మంత్రి మేకపాటి శనివారం పాల్గొన్నారు. చేనేతరంగం మహా ప్రస్థానాన్ని..మరో ప్రస్థానంగా మలిచేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు.

మహాత్ముడి మాట..మహాత్మ చూపిన బాట..మంచి  జ్ఞాపకం: మంత్రి మేకపాటి*

మా బట్టలు మేమే తయారుచేసుకుంటాం..మా సంప్రదాయ వస్త్రాలు మేం నేస్తామని  బ్రిటిష్ వారికి  మహాత్మా గాంధీ గొంతెత్తి చాటారని మంత్రి మేకపాటి ఈ సందర్భంగా ప్రస్తావించారు. 'చేనేత' అన్న పదం వింటే నాకు గుర్తొచ్చేది చట్రంతో వస్త్రం నేయటమేనని తన మంచి  జ్ఞాపకాన్ని మంత్రి మేకపాటి భావోద్వేగంగా పంచుకున్నారు. గ్రామీణ స్థాయిలో అభివృద్ధిని చేసి చూపిస్తామన్నారు. గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు  వేస్తున్నామన్నారు. అభివృద్ధి అంటే పట్టణాలలో పెద్ద పెద్ద భవనాల నిర్మాణాలు కాదు, గ్రామీణ స్థాయిలోనూ సకల సౌకర్యాలు కల్పించడమన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి శైలి అభివృద్ధికి నిర్వచనమని ఆయన పేర్కొన్నారు. అంతకు ముందు ఆప్కో కార్యాలయంలో ఏర్పాటు చేసిన చేనత వస్త్రాలను మంత్రి ఆసక్తిగా పరిశీలించారు. రెండో అంతస్తులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాళ్లల్లోని చేనేతల కళాత్మక సజీవ రూపాలను ఆయన ఆసక్తిగా తిలకిస్తూ అడిగి తెలుసుకున్నారు. మూడో అంతస్తులో ఏర్పాటు చేసిన మగ్గాన్ని, వినియోగాన్ని మంత్రి మేకపాటి పరిశీలించారు.

చేనేత వస్త్రాలకు బ్రాండింగ్, మార్కెటింగ్ పెంచేందుకు ప్రభుత్వం పెద్దపీట*

అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి సంస్థలతో ఒప్పందాలు చేసుకుని ఆయా వెబ్ పోర్టల్ ల ద్వారా  చేనేత వస్త్రాల విక్రయాలు, మార్కెటింగ్ పెంచేందుకు అడుగు ముందుకు వేస్తున్నట్లు మంత్రి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. చేనేత వస్త్రాలకి ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తామన్నారు. యువతరానికి చేనేత వస్త్రాలను చేరువ చేసేందుకు ఉన్న మార్గాలను అన్వేషిస్తామన్నారు. మారుతున్న పరిస్థితులకు తగ్గట్లుగా మగ్గం వ్యవస్థకు బదులు అత్యాధునిక విధానాలైన మిషన్ లూమ్స్ అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి తెలిపారు. నేత కార్మికులకు శిక్షణ లూమ్స్ కొనుగోలుకు  ప్రభుత్వం సహాయం చేయనున్నట్లు పేర్కొన్నారు. అంతకు ముందు చేనేత వస్త్రాల రూపకల్పనలో  కొత్త ఒరవడి సృష్టించిన, అద్భుత వస్త్రాలుగా తీర్చిదిద్దిన నాటి తరం 11 మంది చేనేతలకు పురస్కారాలు అందజేశారు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. కరోనా కష్టకాలంలో కుటుంబాలకు దూరమైన 13 మంది చేనేతల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి   రూ.12500 చొప్పున ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డితో కలిసి ఆప్కో తరపున ఆర్థిక సాయం అందించారు.

10వ తేదీన ముచ్చటగా మూడోసారి సీఎం చేతులమీదుగా వైఎస్ఆర్ నేతన్న నేస్తం*

ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ముచ్చటగా మూడోసారి ఈ నెల 10వ తేదీ, మంగళవారం రోజున ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ నేతన్న నేస్తం మూడో విడతగా రూ.200కోట్లు అందజేయడానికి  ప్రభుత్వం సన్నద్ధమయినట్లు మంత్రి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. నేత కార్మికుల సంక్షేమానికై కరోనా విపత్తు సమయంలో కూడా గత రెండేళ్లుగా ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు పెట్టిందన్నారు. మేనిఫెస్టో హామీ మేరకు ముఖ్యమంత్రి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ నేతన్న నేస్తం ద్వారా చేనేతలకు  అండగా నిలబడుతోందన్నారు. మగ్గం ఉన్న ఒక్కో  చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.24 వేలు చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ముడిసరుకుల కొనుగోలు సహా చేనేతల స్థితిగతులు మార్చడమే  'వైఎస్ఆర్ నేతన్న నేస్తం' అమలు ధ్యేయమని మంత్రి పేర్కొన్నారు.

జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, శాసనమండలి సభ్యురాలు పోతుల సునీత, ఆప్కో చైర్మెన్ చల్లపల్లి మోహన్ రావు,  విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, చేనేత జౌళి శాఖ కార్యదర్శి శశిభూషణ్, చేనేత జౌళి శాఖ డైరెక్టర్ అర్జునరావు , ఆప్కో జనరల్ మేనేజర్ రమేష్, జాయింట్ డైరెక్టర్లు కన్నబాబు, ఎం.నాగేశ్వరరావు,   తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.




Comments