పులిచింతల ప్రాజెక్టును సందర్శించిన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

 


- పులిచింతల ప్రాజెక్టును సందర్శించిన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని


- మంత్రులు పేర్ని నాని, వెలంపల్లితో కలసి 16 వ నంబరు గేటు ప్రాంతం పరిశీలన


 విజయవాడ/ జగ్గయ్యపేట, ఆగస్టు 7(ప్రజా అమరావతి): పులిచింతల ప్రాజెక్టు 16 వ నంబరు గేటు వద్ద సాంకేతిక సమస్య ఏర్పడి గేటు విరిగిపోయిన ప్రదేశాన్ని రాష్ట్ర

రవాణ, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావుతో కలిసి రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల  వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) గురువారం పరిశీలించారు . ఈ సందర్భంగా గేటు విరిగిపోయిన సంఘటనకు సంబంధించి ప్రాధమిక సమాచారాన్ని అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. 16 నంబరు గేటును ప్రాంతాన్ని పేర్ని నాని వెలంపల్లితో కలసి మంత్రి కొడాలి నాని పరిశీలించారు. బుధవారం రాత్రి జరిగిన ఘటనపై వివరాలను సంబంధిత ఇంజనీర్లు వివరించారు. ఈ సందర్భంగా గేటు మరమ్మత్తులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి తక్షణ చర్యలు చేపట్టి త్వరితగతిన పూర్తి చేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. పులిచింత ప్రాజెక్టు గేటు విరిగిపోయిన ప్రాంతంలో తక్షణ మరమ్మత్తులు చేపట్టేందుకు తీసుకున్న చర్యలను పులిచింతల ప్రాజెక్టు ఎస్ఈ ఎ. రమేష్ బాబు మంత్రులకు వివరించారు. మరో వైపు వరద ఉధృతి తగ్గించేందుకు చర్యలు చేపట్టామన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి కొడాలి నాని ఇంజనీర్లకు సూచించారు. కృష్ణా నదీ పరివాహక ప్రాంత ప్రజలను మరింత అప్రమత్తం చేయాలన్నారు. వీరి వెంట పులిచింతల ఎస్ఇ రమేష్ బాబు, ఇఇ శ్యామ్ ప్రసాద్ డిఇఇ సుధాకర్, అరుణ కుమారి తదితరులు పాల్గొన్నారు.

Comments