శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
, విజయవాడ (ప్రజా అమరావతి): శ్రీ శివ స్వామీజీ గారు శ్రీ కనకదుర్గా అమ్మవారికి పవిత్ర సారె సమర్పించుటకు గాను విచ్చేయగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం శ్రీ శివ స్వామీజీ వారు శ్రీ అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారికి పవిత్ర సారె సమర్పించడం జరిగింది. అనంతరం శ్రీ శివ స్వామీజీ గారికి శ్రీయుత కార్యనిర్వహణాధికారి వారు శ్రీ అమ్మవారి ప్రసాదములు, పండ్లు అందజేయడం జరిగినది. అనంతరం మహామండపం 6 వ అంతస్థు నందు శ్రీ అమ్మవారి ఉత్సవమూర్తి వద్ద ఆలయ అర్చకులు పూజలు నిర్వహించిన అనంతరం శ్రీ శివ స్వామీజీ గారు అమ్మవారి ప్రాశస్థ్యము మరియు ఆషాడ మాసం విశిష్టత మరియు ఇతర అంశముల గురించి ప్రసంగించి అందరికీ అనుగ్రహ భాషణం చేశారు.
addComments
Post a Comment