పలాస కాశీబుగ్గ ప్రజల దాహార్తి తీర్చడమే లక్ష్యంగా ప్రణాళికలు.
రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడి పరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు.
అర్బన్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ పనులు శంకుస్థాపనకు చర్యలు.
మంత్రిని కలిసిన వెల్కో ఇన్ఫ్రాటెక్ కంపెనీ ప్రతినిధులు.
ఈ నెల మూడవ వారంలో శంకుస్థాపనకు సిద్దం.
శంకుస్థాపన కార్యక్రమానికి మున్సిపల్ మంత్రికి ఆహ్వానం.
పలాస: ఆగష్టు 07 (ప్రజా అమరావతి):
పలాస నియోజకవర్గంలో పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ ప్రజలకు దాహార్తి తీర్చేందుకు పూర్తి ప్రణాళికలు రచించి ఇంటింటికి మినరల్ వాటర్ అందించేందుకు ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడి పరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. పలాస నియోజకవర్గం ప్రజలకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 7 వందల కోట్ల రూపాయలతో ఉద్దానం శుద్ధజల ప్రాజెక్టు మంజూరు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకుని ప్రస్తుతం 60 శాతం పనులు పూర్తి చేసుకున్నామని అన్నారు. మరో ఆరు నెలల్లో మిగతా 40 శాతం పనులు పూర్తి చేసుకుని ఉద్దాన ప్రాంత ప్రజలకు ఇంటింటికీ శుద్ధ జలం అందించేందుకు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రజలకు అంకితం చేస్తామని అన్నారు. అయితే అర్బన్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు ద్వారా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ ప్రజలకు మంచినీటి ఎద్దడిని తీర్చేందుకు ఇప్పటికే డెండర్ కూడా పూర్తి అయ్యిందని అన్నారు. అర్బన్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు వెల్కో ఇన్ఫ్రాటెక్ కంపెనీ వారికి దక్కిందని తెలిపారు. ఈ నెల మూడవ వారంలో పనులు ప్రారంభం కోసం శంకుస్థాపన చేసేందుకు కంపెనీ ప్రతినిధులు విజయవాడలో మంత్రి డాక్టర్ అప్పలరాజును కలిశారని అన్నారు. రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి బొత్స సత్యన్నారాయణను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్లు తెలిపారు. పలాస కాశీబుగ్గ మున్సిపలాలిటీ ప్రజలకు మంచి నీటి కోసం చాలా ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో పలాస నియోజకవర్గం ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చామో అందులో ప్రధానమైనది త్రాగు నీరు. మినరల్ వాటర్ నియోజకవర్గంలోని ఇంటింటికి ఇవ్వడం అనేది రాష్ట్రంలోనే ప్రధమంగా జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేని విదంగా పలాస నియోజకవర్గంలో ఇంటింటికి శుద్దజలం అందించడం జరుగుతుండటం వలన రాష్ట్ర ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు తెలిపారు. ఈ నెల మూడవ వారంలో అర్బన్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమం చేపట్టి పనులు త్వరితగతిన ప్రారంభిస్తామని అన్నారు. ఈ వాటర్ స్కీమ్ 33 కోట్, 94 లక్షల, 41 వెయ్యి, 931 రూపాయల వ్యయంతో పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ ప్రజల నీటి కష్టాలు రానున్న రోజుల్లో తీరనున్నాయని వైసిపి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి పని చేస్తుందని తెలిపారు.
addComments
Post a Comment