గ్రామస్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశాన్ని నిర్వహించడం జరిగినది.

 కొల్లిపర (ప్రజా అమరావతి); మండలంలోని చివలూరు రైతు భరోసా కేంద్రము నందు గ్రామస్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశాన్ని నిర్వహించడం జరిగినది. ఈ


సమావేశంలో వ్యవసాయధికారి అక్తర్ హుస్సేన్ గారు, గ్రామ వ్యవసాయ సహాయకులు, సలహా మండలి సభ్యులు, మరియు అభ్యుదయ రైతులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పంట నమోదు గురించి, రైతు భరోసా కేంద్రం ద్వారా అందించు ఎరువులు, పురుగు మందులు  మరియు సబ్సిడీ విత్తనములు గురించి, రైతు భరోసా కేంద్రం ద్వారా అందించే సేవల గురించి, రైతు భరోసా కేంద్రం పరిధిలో వేసేటువంటి పంటల  సాగు వివరములు గురించి, కౌలు రైతులకు పంట నమోదు ప్రాముఖ్యత గురించి, పొలంబడి కార్యక్రమం గురించి, ఎన్.ఎఫ్.ఎస్.ఎం ద్వారా రైతులకు అందించిన 100% రాయితీ LRG 52 కంది విత్తనాల గురించి, కౌలు రైతులకు మరియు సాగు దారులకు బ్యాంకులలో ఇచ్చు లోన్ల గురించి తెలియజేసి చర్చించడం జరిగినది. డాక్టర్ వై.ఎస్.ఆర్ రైతు భరోసా మరియు పీఎం కిసాన్ స్పందనలను ఫిర్యాదులు తీసుకోవటం జరిగినది. పంట నమోదు గురించి అవగాహన కల్పించడం జరిగింది.  పంటలు వేసిన రైతుల యొక్క పంట నమోదుకు కావలసిన వివరములను సేకరించడం జరిగింది. ఈ విషయాలను చర్చించుకున్న తర్వాత వీటిని అమలు పరచుటకు తీర్మానాలు తయారు చేసుకోవడం జరిగినది.

Popular posts
భారీ గజమాలతో సత్కరించిన అభిమానులు
Image
సంక్షేమ నవశకానికి నాంది నవరత్నాల పథకాలు :
శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ
ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో తీసుకువస్తున్న రిఫార్మ్స్,టెక్నాలజీ వినియోగంలో రాష్ట్రంలోని క్షేత్రస్థాయి అధికారులకు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ట్యాబ్ లను అందజేసిన డి‌జి‌పి గౌతం సవాంగ్ IPS గారు. కార్యక్రమంలో పాల్గొన్న కడప జిల్లా ఎస్పి అన్బురాజన్ IPS .
Image
అక్టోబర్ 30న మెగా జాబ్ మేళా : ఐ.టీ, పరిశ్రమలు , నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
Image