కోవిడ్ థర్డ్ వేవ్ నేపథ్యంలో ఆస్పత్రిలో అదనపు ఐసీయూ, ఆక్సిజన్ బెడ్ల ఏర్పాటు చేస్తున్నాం
*
*: జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్*
*: అనంతపురం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్*
అనంతపురం, ఆగస్టు 13 (ప్రజా అమరావతి) :
*కోవిడ్ థర్డ్ వేవ్ నేపథ్యంలో అనంతపురం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో అదనపు ఐసీయూ బెడ్లు, ఆక్సిజన్ బెడ్లను ఏర్పాటు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ పేర్కొన్నారు. అనంతపురం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని శుక్రవారం జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఏ.సిరితో కలిసి జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.*
*అనంతరం జిల్లా కలెక్టర్ పాత్రికేయులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆస్పత్రిలో వివిధ విభాగాలను తనిఖీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. చికిత్స పొందుతున్న పేషెంట్లతో ఇంటరాక్ట్ అయ్యామన్నారు. ఆస్పత్రిలో ట్రీట్మెంట్ ఎలా ఉంది, మందులకు, టెస్టులకు డబ్బులు తీసుకుంటున్నారా లేక ఇక్కడికి వచ్చిన పేషెంట్ లను మరో చోటుకి వెళ్ళమని చెబుతున్నారా అనేది పరిశీలన చేయడం జరిగిందన్నారు. అయితే వాటికి సంబంధించి రోగుల నుంచి ఎక్కడ ఎలాంటి ఫిర్యాదులు అందలేదని తెలిపారు. భోజనం, శానిటేషన్, మరుగుదొడ్ల నిర్వహణ పై ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగిందని, భోజనం, శానిటేషన్ పై ఎలాంటి కంప్లైంట్ రాలేదన్నారు. ఆస్పత్రిలో బెడ్ ల సామర్థ్యం కన్నా అవుట్ పేషెంట్స్, ఇన్ పేషెంట్స్ ఎక్కువగా ఉన్నారన్నారు. సిబ్బంది ఎవరైనా తప్పు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. కోవిడ్ థర్డ్ వేవ్ లో పీడియాట్రిక్ కేసులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒక సిక్ న్యూబార్న్ కేర్ ను అదనంగా ఏర్పాటు చేయిస్తున్నామన్నారు. ఇప్పటికే ఆక్సిజన్ పిఎస్ఎ ప్లాంట్ ఇన్స్టాల్ చేయడం జరిగిందని, మరొకటి కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. కోవిడ్ థర్డ్ వేవ్ నేపథ్యంలో అన్ని రకాలుగా చేపట్టాల్సిన పనులన్నీ గుర్తించడం, అవసరమైన స్టాఫ్ నర్సులు, టెక్నీషియన్ల లాంటి మాన్ పవర్ తీసుకోవడం జరిగిందన్నారు. పీడియాట్రిక్ వైద్యులు 60 మంది అవసరమవుతుండగా, 15 మంది సిద్ధంగా ఉన్నారని, ఐఎంఎ వైద్యులతో మాట్లాడి అవసరమైన పీడియాట్రిక్ వైద్యులను తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. థర్డ్ వేవ్ కోసం అన్ని రకాలుగా సివిల్ వర్కులు, కావాల్సిన వైద్య సిబ్బందిని రిక్రూట్మెంట్ ను పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.*
*అంతకుముందు జిల్లా కలెక్టర్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని గైనిక్ ఐసియు వార్డు, క్యాజువాలిటీ వార్డు, నూతనంగా నిర్మించే బోయే లేబర్ వార్డు లో జరిగే పనులను పరిశీలించారు. ఐసియు, బాలింతలు, గర్భవతుల వార్డులు, ఎస్ఐసియు, పోస్ట్ ఆపరేటివ్ వార్డు, ఫిమేల్ సర్జరీ వార్డు తదితర వార్డులను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న కళ్యాణ్ దుర్గం కి సంబంధించిన రత్నమ్మ,పేషెంట్ లతో, రితికసాయిచిన్న పిల్లల తల్లులతో, శ్యామలగర్భవతులతో ఆప్యాయంగా మాట్లాడారు. చికిత్సలు సక్రమంగా చేశారా, మౌలిక వసతులు కల్పిస్తున్నారా అడిగి తెలుసుకున్నారు. సరైన వైద్య సేవలు అందిస్తున్నారా, నాణ్యమైన భోజనం పెడుతున్నారా, కాఫీ, టీ, స్నాక్స్ లాంటివి ఇస్తున్నారా, అన్నం, పప్పు, చారు, చపాతి, పెరుగు, లాంటివి సమయానికి అందిస్తున్నారా, అవసరమైన మందులు ఇచ్చారా, వార్డులను శుభ్రం చేస్తున్నారా, అంటూ పేషెంట్లతో ప్రభుత్వ ఆస్పత్రిలో అందిస్తున్న సౌకర్యాలపై, పేషెంట్లకు చేసిన సర్జరీల పై, వారి ఆరోగ్యంపై జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. వారు సంతృప్తికరంగా సమాధానం చెప్పారు.
*ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ ఎంట్రెన్స్ ను విడిగా వాడాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. వార్డులు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, పేషెంట్లకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. మరుగుదొడ్ల అధ్వానంగా ఉన్నాయని అవసరమైన రిపేర్లు చేయించి మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. గర్భవతుల వార్డులో చేపడుతున్న పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు.*
అనంతరం జిల్లా కలెక్టర్ ఆసుపత్రి ఆవరణలో చెట్టు
నాటారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సిరి పాల్గొన్నారు.
*ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ జగన్నాథం, RMO, విశ్వనాధ్ య్య ,Dy Rmo Y.v. రావు , Dy Rmo విజయమ్మ,గైనిక్ వార్డు హెచ్ఓడి శంషాద్ బేగం, ఫిమేల్ సర్జరీ వార్డ్ హెచ్ఓడి రామస్వామి నాయక్, హెచ్ ఓ డి డాక్టర్ మల్లేశ్వరి, భాస్కర,పలువురు డాక్టర్లు, మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment