చిన్నపిల్లలపై ఎలాంటి అమానుష సంఘటనలు జరిగినా డయల్ 1098 కి ఫోన్ చెయ్యండి
-మెదక్ ఎస్పీ చందనాదీప్తి
మెదక్:,సెప్టెంబర్-21(ప్రజా అమరావతి);
మెదక్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ చందనా దీప్తి (ఐ.పి.యెస్) మాట్లాడుతూ మెదక్ మున్సిపల్ లో ట్రాక్టర్ డ్రైవర్ గా విధులు నిర్వర్తిస్తున్న నాగరాజు విచక్షణ రహితంగా చిన్నారిని కొట్టడం సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తమ దృష్ఠికి రాగానే వెంటనే మా సిబ్బందిని ఆ పాప వాళ్ళ ఇంటికి వెళ్ళి పాపను వెంటనే సంరక్షించి పాప యొక్క తండ్రి నాగరాజును అతనితో ఉంటున్న వెన్నెలను మరియు ఆమె కూతురును శ్రీను పిఎస్ కు తీసుకొని రావడము జరిగినది ఇట్టి విషయములో పాప తండ్రి నాగరాజు(25) పైన సీఆర్ నెంబర్.255/2021 అండర్ సెక్షన్ ఐపీసీ 324 ఐపీసీ 75 జేజే ఆక్ట్ క్రింద సుమోటో కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించడం జరిగిందని అన్నారు.అలాగే బాల్యం ఎంతో మధురమైనదని పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దాలంటే బాల్యం ఎంతో ముఖ్యమైనదని అట్టి బాల్యాన్ని కాపాడాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక పౌరుడిపై ఉన్నదని తెలిపినారు.జిల్లాలో ఎవరైనాచిన్న పిల్లల పైన ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడినా వారు ఎంతటి వారైనా విడిచిపెట్టేది లేదని ఈ సందర్భంగా హెచ్చరించారు.బాల్యం చాలా అందమైనదని వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే వారే ఇలాంటి చర్యలకు పాల్పడటం ఒకింత బాధాకరమని అన్నారు.అలాగే ఎవరైనా బాలల ని హింసించటం కానీ వారి చేత పనులు చేయిస్తే వారు బాలకార్మిక చట్టం కింద శిక్షార్హులు అవుతారని హెచ్చరించారు. బాలల పైన ఎవరైన తమ ప్రాంతాల్లో అఘాయిత్యాలకు పాల్పడినా లేక హింసకు గురైనా వెంటనే 1098 కి కానీ డయల్ 100 కి కానీ సమాచారం అందించాలని తమ సిబ్బంది ద్వారా చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయని తెలిపారు.
addComments
Post a Comment