తాడేపల్లి (ప్రజా అమరావతి); పట్టణంలో పలు ప్రాంతాల్లో పట్టణ అధ్యక్షులు బుర్రముక్కు వేణుగోపాలస్వామి రెడ్డి గారి ఆధ్వర్యంలో మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 12వ వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.*
*తాడేపల్లి క్రిస్టియన్ పేట చర్చి వద్ద యూత్ ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ఆర్ మరియు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.*
*తాడేపల్లి వైఎస్సార్ సెంటర్లో వైయస్సార్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.*
*డొలాస్ నగర్ లో వైయస్సార్ ఇందిరాగాంధీ బాబు జగ్జీవన్ రావ్ గార్ల విగ్రహాలకు పూలమాలలు వేసిన అనంతరం పట్టణ అధ్యక్షులు బుర్రముక్కు వేణుగోపాలస్వామి రెడ్డి గారు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.*
*మహానాడు 13వ రోడ్డు నందు జిల్లా ST సెల్ ప్రధాన కార్యదర్శి చిన్న పోతుల దుర్గారావు, పట్టణ మహిళా కన్వీనర్ అప్పికట్ల సంపూర్ణ పార్వతి గార్ల ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ఆర్ మరియు వంగవీటి మోహన రంగా గార్ల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.*
*14వ వార్డు ముగ్గు రోడ్డు నందు SC సెల్ కన్వీనర్ ముదిగొండ ప్రకాష్ ఆధ్వర్యంలో చిన్నారులచే వైయస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.*
*గాంధీనగర్ లో పప్పీ శ్యామ్ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు బుర్రముక్కు వేణుగోపాలస్వామి రెడ్డి గారు వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి వృద్ధులు, వితంతువులకు చీరలు పంపిణీ చేశారు*
*బ్రహ్మానంద పురం లో పట్టణ కార్యదర్శి దర్శి రమేష్ ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ఆర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గార్ల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.*
*ప్రకాష్ నగర్ లో జీలగ పెదగాలయ్య ఆధ్వర్యంలో డాక్టర్ వైయస్ఆర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గార్ల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు*
*తాడేపల్లి పట్టణంలోని CSR రోడ్ నందు వృద్ధాశ్రమంలో మండల యువజన విభాగం కన్వీనర్ మున్నంగి వివేకానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు బుర్రముక్కు వేణుగోపాలస్వామి రెడ్డి గారి చేతుల మీదగా దుప్పట్లు పండ్లు పంపిణీ చేశారు*
*ఈ వర్ధంతి కార్యక్రమాలలో మాజీ కౌన్సిలర్లు, వివిధ విభాగాల కన్వీనర్లు, మంగళగిరి సోషల్ మీడియా కోఆర్డినేటర్ మేకా వెంకటరామిరెడ్డి, నాయకులు తోట సాంబశివరావు, దర్శి శ్రీనివాసరావు, చిలుకోటి శ్రీనివాస్ మధు, అమృత రావు, మార్క్, మండే విజయ్, సంకుర అశోక్, సయ్యద్ రసూల్, షేక్ రియాజ్, సన్నీ, సత్తి తదితరులు పాల్గొన్నారు*
addComments
Post a Comment