ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్న బెడ్స్‌ 92.50 శాతం



*కోవిడ్‌ –19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్, వైద్య,ఆరోగ్యశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.*


అమరావతి (ప్రజా అమరావతి);

*కోవిడ్‌ –19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై సీఎంకు వివరాలందించిన అధికారులు.*

రాష్ట్రంలో యాక్టివ్‌ కేసులు 14,452 

రికవరీ రేటు 98.60 శాతం

10,494 సచివాలయాల్లో యాక్టివ్‌ కేసులు నమోదు శాతం జీరో

ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారు 3,560 మంది

కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో చికిత్స పొందుతున్నవారు 926 మంది

హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నవారు 9,966 

ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్న బెడ్స్‌ 92.50 శాతం


ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందుతున్న బెడ్స్‌ 70.69 శాతం

104 కాల్‌ సెంటర్‌కు వచ్చిన ఇన్‌కమింగ్‌ కాల్స్‌ 684 మాత్రమే

18 దఫాలుగా ఇప్పటివరకు ఫీవర్‌ సర్వే పూర్తి


*థర్డ్‌ వేవ్‌ సన్నద్ధతపై ప్రణాళిక*

అందుబాటులో ఉన్న ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్‌  20,964

ఇంకా రావాల్సినవి 2493

అందుబాటులో ఉన్న ఆక్సిజన్‌ డి–టైప్‌ సిలిండర్లు 27,311

ఆక్సిజన్‌ పైప్‌లైన్‌ పనులు పూర్తైన ఆస్పత్రులు 108 


*ఆక్సిజన్‌ జనరేషన్‌ (పీఎస్‌ఏ) ప్లాంట్లు*  

50 అంతకంటే ఎక్కువ బెడ్స్‌ ఉన్న ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్లు ఏర్పాటు

మొత్తం 140 ఆస్పత్రులలో పీఎస్‌ఏ ప్లాంట్లు ఏర్పాటు

అక్టోబరు 6 నాటికి ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్లు ఏర్పాటు పూర్తవుతుందని తెలిపిన అధికారులు


*వ్యాక్సినేషన్‌*

ఇప్పటివరకు వ్యాక్సినేషన్‌ చేయించుకున్నవారు 2,23,34,971 మంది

సింగిల్‌ డోసు వ్యాక్సినేషన్‌ పూర్తైన వారు 1,31,62,815 మంది

రెండు డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తైన వారు 91,72,156

మొత్తం వినియోగించిన వ్యాక్సినేషన్‌ డోసుల సంఖ్య 3,15,07,127 


*ఇటీవల కేరళలో పర్యటించిన అధికారులు, వైద్యాధికారుల బృందం*

*కోవిడ్‌తో పాటు ఇతర క్షేత్రస్థాయి పరిశీలనాంశాలను సీఎంకు వివరించిన అధికారులు*


*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే...:*

శిశు మరణాలను తగ్గించాలి  అధికారులకు సీఎం ఆదేశం

దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టాలి సీఎం 

ఫ్యామిలీ హెల్త్‌ డాక్టర్‌ కాన్సప్ట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న సీఎం

చక్కటి విధివిధానాలను ఖరారు చేయాలన్న సీఎం


కొత్తగా నిర్మిస్తున్న మెడికల్‌ కాలేజీల్లో పీజీ కోర్సులు కూడా ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం

పారామెడికల్‌ సిబ్బందికీ మెడికల్‌ కాలేజీల్లో శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం

పబ్లిక్‌ హెల్త్‌ అడ్మినిస్ట్రేషన్‌పై కోర్సులు పెట్టాలన్న సీఎం


ప్రజారోగ్యంపై నిరంతర పరిశీలన, పర్యవేక్షణ ఉండాలన్న సీఎం

రక్తం, నీరు, గాలి ఈ మూడింటిపైన పరీక్షలు జరగాలన్న సీఎం

విలేజ్‌ క్లినిక్స్‌ స్థాయిలో ఈ పరీక్షలు అందుబాటులోకి ఉండాలన్న సీఎం

అవసరమైన చోట సీహెచ్‌సీల్లో కూడా డయాలసిస్‌ యూనిట్లు అందుబాటులోకి తీసుకురావాలన్న సీఎం


హెల్త్‌డేటాపై అన్నిరకాల చర్యలు తీసుకోవాలన్న సీఎం

ఎక్కడ పరీక్షలు చేయించుకున్నా, ఎక్కడ చికిత్స తీసుకున్నా   గుర్తింపు కార్డు ద్వారా ఆ వివరాలతో కూడిన డేటా అప్‌లోడ్‌ చేయాలన్న సీఎం

ఒక వ్యక్తి వైద్యంకోసం ఎక్కడకు వెళ్లినా ఆ వివరాలు డాక్టర్‌కు వెంటనే అందుబాటులోకి వచ్చేలా విధానం ఉండాలన్న సీఎం

ప్రయివేటు ఆస్పత్రికి వెళ్లినా, విలేజ్‌ క్లినిక్‌నుంచి టీచింగ్‌ ఆస్పత్రి వరకూ ఎక్కడికి వెళ్లినా ... అక్కడ చేయించుకున్న పరీక్షల వివరాలు, చికిత్స వివరాల డేటా అప్‌లోడ్‌ కావాలన్న సీఎం

దీనికి సంబంధించి మంచి సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకురావాలన్న సీఎం


థర్డ్‌వేవ్‌ సమాచారం నేపథ్యంలో కోవిడ్‌ నియంత్రణకు నూతన చికిత్సా విధానాలపై దృష్టి సారించాలన్న సీఎం

కొత్త మందులు, మెరుగైన ఫలితాలు, తక్కువ దుష్ప్రభావాలు ఉన్నవాటి వినియోగంపై దృష్టిపెట్టి అన్నిరకాలుగా సిద్ధం కావాలన్న సీఎం


ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌(నాని), సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, కోవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ ఛైర్‌ పర్సన్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, 104 కాల్‌ సెంటర్‌ ఇంఛార్జ్‌ ఎ బాబు,  ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈఓ వి వినయ్‌ చంద్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ డి మురళీధర్‌ రెడ్డి, పరిశ్రమలశాఖ డైరెక్టర్‌ జే వి యన్‌ సుబ్రమణ్యం, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Comments