గుంటూరు (ప్రజా అమరావతి);
రైతుల చైతన్య దీప్తి ఆర్.బి.కే ఛానల్.
- అజేయ కల్లం.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ శాఖ నిర్వహిస్తున్న ఆర్.బి. కే ఛానల్ రైతుల చైతన్య దీప్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య సలహాదారులు అజేయకల్లం పేర్కొన్నారు.ఈనెల 14వ తేదీన మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి తో కలిసి గన్నవరం లో వున్న ఆర్.బి కే ఛానల్ ను అజేయ కల్లం సందర్శించారు.రైతుల సమస్యల పరిష్కారం కోసం సమీకృత రైతు సమాచార కేంద్రాన్ని నిర్వహించడం తద్వారా వ్యవసాయ రంగానికి చెందిన వివిధ శాస్త్ర సాంకేతిక అంశాలపై వారి సందేహాలను నివృత్తి చేయడం గమనార్హమన్నారు.వ్యవసాయ శాస్త్రవేత్తలతో చర్చా గోష్టులు నిర్వహించడం,రాష్ట్రంలో వున్న రైతు భరోసా కేంద్రాలతో అనుసంధానం చేయడం ద్వారా ఆర్.బి.కే ఛానల్ విజయవంతమైందన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరలపై, వాతావరణ పరిస్థితులపై, వ్యవసాయ ఉత్పత్తుల సప్లై మరియు డిమాండ్లపై సరైన అవగాహన కల్పించడానికి ఆర్ బి కే ఛానల్ తోడ్పడాలని అభిలషించారు.రైతుల ప్రశ్నలకు సరైన సమాధానాలు దొరికే అస్త్రంగా ఆర్.బి.కే ఛానల్ తోడ్పడుతుందని ఆశించారు.
ఇట్లు
అచ్యుత్
పి..ఆర్.ఓ
8790005577
addComments
Post a Comment