ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా ఎపి భవన్ లో ఆదిత్యా నాధ్ దాస్ నియామకం.

 ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా ఎపి భవన్ లో ఆదిత్యా నాధ్ దాస్ నియామకం.


అమరావతి,26, సెప్టెంబర్ (ప్రజా అమరావతి): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా ఆదిత్యా నాధ్ దాస్ ను నియమిస్తూ ప్రభుత్వం జిఓ ఆర్టీ సంఖ్య 1586 ద్వారా శనివారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా ఉన్న ఆయన ఈనెల 30వ తేదీన పదవీ విరమణ చేసిన అనంతరం ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా బాధ్యతలు చేపడతారు.పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన ఢిల్లీలోని ఎపి భవన్ నుండి ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా బాధ్యతలు నిర్వహిస్తారు.ముఖ్య సలహాదారుగా నియమించబడిన ఆదిత్యా నాధ్ దాస్ కు రాష్ట్ర కేబినెట్ మంత్రి హోదా ఉంటుందఅనార.


Comments