పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ త్రాగునీటి స్కీమ్ పనులు ప్రారంభానికి సిద్దం కావాలి.

 పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ  త్రాగునీటి స్కీమ్ పనులు ప్రారంభానికి సిద్దం కావాలి.రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడిపరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు.


మంత్రిని కలిసిన ఎన్.సి.సి ప్రతినిధులు.


పలాస (ప్రజా అమరావతి).


పలాస కాశీబుగ్గ మున్సిపాలిటి ప్రజల దాహార్తిని తీర్చేందుకు  అర్బన్ వాటర్ స్కీమ్ పనులు త్వరగా ప్రారంభించాలని ఎన్.సి.సి ప్రతినిధులను కోరిన రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడిపరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి. గురువారం మంత్రి కార్యాలయంలో ఎన్.సి.సి ప్రతినిధులు రాష్ట్ర మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు గారిని మర్యాదపూర్వకంగా  కలిసి పనుల వివరాలు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అర్బన్ వాటర్ సప్లే స్కీమ్ ద్వారా మంజూరు చేసిన పనులను ఎన్.సి.సి కంపెనీ పనులు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న సంగతి ఎన్.సి.సి ప్రతినిధులు మంత్రికి తెలిపారు. ప్రస్తుతం పనులకు సంబందించి సర్వే వర్క్ చేస్తూ సోర్స్ టు ఇ.ఎస్.ఎల్.ఆర్  స్కోప్ డిజైన్ చేసి అప్రువల్ చేసే దిశగా పనులు కొనసాగుతున్నాయని అన్నారు. సంబందిత ఎస్‌.ఇ తో మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు మాట్లాడి త్వరగా పనులు ప్రారంభించేందుకు సన్నహాలు చేయాలని కోరారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ ప్రజల దాహార్తి తీర్చేందుకు శాశ్వత ప్రాతిపదికన పనులు చేపడుతున్నామని రాష్ట్ర ప్రభుత్వం అర్బన్ వాటర్ సప్లే స్కీమ్ ద్వారా రాష్ట్రంలో పలు మున్సిపాలిటీ లకు స్కీమ్ అందించారని వాటిలో భాగంగా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ కి కూడా ఏపి వాటర్ సప్లే అండ్ సెప్టేజ్ అర్బన్ స్కీమ్ ద్వారా మంచి నీటి సౌకర్యానికి పనులు ప్రారంభించే విదంగా ఎన్.సి.సి ఒప్పందం కుదుర్చుకోవడం సంతోషం వ్యక్తం చేశారు. నిర్దేశిత సమయంలో పనులు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేసేలా పనులు యుద్ద ప్రాతిపదికన చేపట్టాలని మంత్రి సూచించారు.