వివిధ శాఖల్లో పెండింగ్లో ఉన్న సమాచార హక్కు చట్టం కేసులకు



నెల్లూరు, సెప్టెంబర్ 8 (ప్రజా అమరావతి): జిల్లాలో వివిధ శాఖల్లో పెండింగ్లో ఉన్న సమాచార హక్కు చట్టం కేసులకు


సంబంధించి మూడు రోజుల విచారణ కార్యక్రమంలో భాగంగా చివరి రోజు 12 కేసులకు గానూ 11 కేసులను పూర్తిస్థాయిలో రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ శ్రీ రేపాల శ్రీనివాసరావు పరిష్కరించినట్లు ఆయన వ్యక్తిగత కార్యదర్శి శ్రీ బదరీనాథ్  పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లోని శంకరన్ సమావేశ మందిరంలో సమాచార హక్కు చట్టం దరఖాస్తులకు సంబంధించిన కేసులపై అప్పీలుదారులు, సంబంధిత పౌర సమాచార అధికారులతో ఆర్ టి ఐ కమిషనర్ విచారించి పరిష్కరించినట్లు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా  బుధవారం 12 కేసులకు గాను 11 కేసులను ఆర్టీఐ కమిషనర్ పూర్తిగా విచారించి ఒక కేసును వాయిదా వేసినట్లు వ్యక్తిగత కార్యదర్శి విచారించారు.ఈ సమావేశంలో ఆర్టీఐ కమిషనర్  సిబ్బంది సాయి, హితేష్, వెంకట్, నాగరాజు పాల్గొన్నారు.


Comments