అమరావతి (ప్రజా అమరావతి).
*వాణిజ్య ఉత్సవం- 2021లో పరిశ్రమలు,వాణిజ్య శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిగారి స్పీచ్*
పరిశ్రమల శాఖ , ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు, సీఐఐ, ప్లాస్టిక్ ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఎగుమతుల సదస్సు జరగడం శుభపరిణామం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నంబర్ వన్
పుష్కలంగా మౌలిక వసతులు, అపారమైన నైపుణ్యం, అవసరమైన మానవవనరులుండడం వల్ల ఏపీ పెట్టుబడులకు స్వర్గధామంగా నిలుస్తోంది
"ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా" భారత ప్రభుత్వం వాణిజ్య సప్త పేరుతో ఘన విజయాలను, గత చరిత్రను స్మరిస్తూ వారం రోజుల వాణిజ్య ఉత్సవాలను నిర్వహిస్తోంది
20 నుంచి 26 వరకూ వాణిజ్య ఉత్సవాన్ని నిర్వహిస్తోంది
ఎగుమతులలో ఆంధ్రప్రదేశ్ శక్తి ,సామర్థ్యాలను దశదిశలా చాటాలనేదే ఉద్దేశ్యం
21,22 తేదీలలో రాష్ట్రస్థాయి ఎక్స్ పోర్టు కాన్ క్లేవ్
24,25,26 తేదీలలో పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సదస్సులు నిర్వహించనున్నాం
600 మంది పారిశ్రామికవేత్తలు, ఎగుమతిదారులు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు భాగస్వామ్యంతో వాణిజ్య ఉత్సవం
ప్రధాన మంత్రి మోదీగారు ప్రవేశపెట్టిన ఆత్మనిర్భర్ భారత్ తో మరింత ముందడుగు
ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో సరికొత్త వస్తువులు, నాణ్యత, ఎగుమతుల వంటి అంశాలలో భారత సంస్థలు ముందుకు సాగుతున్నాయి
తెలియనిది తెలుసుకోవడమే అసలైన అభివృద్ధి
ఏషియన్ దేశాలలో జపాన్, దక్షిణ కొరియా, తైవాన్ లు ఎగుమతులపరంగా ముందంజలో ఉన్నాయి
మన రాష్ట్రంతో పోలిస్తే 5వ వంతు మాత్రమే ఉండే తైవాన్ 330 బిలియన్ డాలర్ల ఎగుమతులు చేసి ప్రపంచ ఎకనమీలో కీలకంగా మారింది. ఆ మొత్తం భారతదేశ ఎగుమతుల కన్నా ఎక్కువ.
400 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని భారత్ అందుకోవాలని ఈ సారి మన ప్రధాన మంత్రి నిర్దేశించారు
మంచి పాలసీలు, మౌలిక సదుపాయాలతోనే ఎగుమతుల లక్ష్యాలను చేరగలం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతంతో పోలిస్తే 2030 కల్లా రెట్టింపు ఎగుమతులు సాధించాలనే ప్రణాళికతో ముందుకెళుతోంది
ఎయిర్ పోర్టుల అభివృద్ధి, రైలు , జాతీయ రహదారుల అనుసంధానంతో చౌక రవాణాకు కేరాఫ్ అడ్రస్ నిలిచి ఎగుమతుల లక్ష్యాన్ని చేరుతాం
ఎగుమతుల సామర్థ్యాన్ని మరింత పెంచడానికి గల అన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటాం
మౌలిక వసతులతోనే పారిశ్రామికాభివృద్ధి అనే నినాదంతో రాష్ట్రం అడుగులు
ఎగుమతులతోనే మౌలిక సదుపాయాలనే ఆలోచనను ఆచరణలో నిరూపిస్తాం
ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రత్యేక పాలసీలు, సంస్కరణల గురించి ప్యానల్ డిస్కషన్ లో చర్చించి ఎగుమతుల రెట్టింపుకు అవి దోహదపడుతాయో కేంద్రప్రభుత్వం భాగస్వామ్యంతో వివరిస్తాం
కోవిడ్-19 సమయంలో ఆర్థిక పరిస్థితులు,జీవనోపాధి, పరిశ్రమల ఇబ్బందుల వంటి అంశాలపై ప్రపంచం మొత్తం ఆందోళన చెందింది
ముఖ్యమంత్రిగారి నాయకత్వంలో పారిశ్రామిక వేత్తలు, ప్రజల భాగస్వామ్యంతో స్వేచ్ఛగా ఎదిగేందుకు , ఎగుమతుల రెట్టింపు సాధించేందుకు , సరికొత్త పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికతో ముందుకు వెళతాం
-------------------------
addComments
Post a Comment