మన రాష్ట్రంలోని పరిశ్రమలు, వాటిమీద ఆధారపడ్డ కుటుంబాలకు మరింత దన్నుగా నిలుస్తున్నాం


అమరావతి (ప్రజా అమరావతి);

మన రాష్ట్రంలోని పరిశ్రమలు, వాటిమీద ఆధారపడ్డ కుటుంబాలకు మరింత దన్నుగా నిలుస్తున్నాం


:

12 లక్షలమందికి ఉపాధినిస్తున్న ఎంఎస్‌ఎంఈలు, టెక్స్‌టైల్‌ స్పిన్నింగ్‌మిల్స్‌కు ఊతమిస్తూ రూ.1124 కోట్ల ప్రోత్సహకాలు విడుదల చేస్తున్నాం:

ఇందులో ఎంఎస్‌ఎంఈలకు నేరుగా దాదాపుగా రూ.450 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లోకి వెళ్తాయి:

టెక్స్‌టైల్స్‌ మిల్స్‌కు నేరుగా వారి ఖాతాల్లోకి మరో రూ.230కోట్ల రూపాయలు కూడా బటన్‌ నొక్కగానే వారి అక్కౌంట్లలోకి వెళ్తాయి:

టెక్స్‌టైల్‌మిల్లులకు ఇవ్వాల్సిన రూ.450 కోట్ల విద్యుత్‌ ఛార్జీ రియింబర్స్‌మెంట్‌ను వారి భవిష్యత్తులో కట్టుబోయే కరెంటు బిల్లుల్లో రిబేటు ఇచ్చి కరెంటు సప్లై చేసే కార్యక్రమాన్ని చేస్తున్నాం:

కష్టకాలంలో వారికి చేయూత నివ్వాలనే తపనతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం:

ఇలా ప్రతి అడుగులోనూ కూడా నిజాయితీగానూ, చిత్తశుద్దితోనూ, చంద్రబాబు హయాంలో పెట్టిన బకాయిలను సైతం పరిష్కరిస్తూ వాటికి కూడా ఒక పరిష్కారం చూపుతూ తద్వారా పరిశ్రమలు పెట్టినవారికే కాదు, అక్కడ పనిచేస్తున్న వారికీ మంచి జరగాలని ఈ కోవిడ్‌ కష్టసమయంలో కూడా అడుగులు ముందుకేస్తున్నాం:

మనసా, వాచా, కర్మేణా ఆలోచనలు చేసి అడుగులు ముందుకేస్తున్నాం:

ఈ 27 నెలల కాలంలోనే ఎంఎస్‌ఎంఈలకు మన అందరి ప్రభుత్వం అందించిన మొత్తం ప్రోత్సాహకాలు అక్షరాల రూ.2,086 కోట్ల రూపాయలు:

ఆసరా, చేయూత, తోడు, చేదోడు ఇలాంటి కార్యక్రమాలే కాకుండా ఈ రూ.2086 కోట్ల రూపాయలు ఇచ్చాం:

ఇందులోకూడా గత ప్రభుత్వం 2015 నుంచి ఎంఎస్‌ఎంఈలకు బకాయిలు పెట్టిన రూ.904 కోట్ల రూపాయలను, గత ప్రభుత్వం స్పిన్నింగ్‌ మిల్లులకు బకాయి పెట్టిన మరో రూ. 684 కోట్ల రూపాయలను ఈ మొత్తం బకాయిల సొమ్ము రూ.1588 కోట్ల కూడా మన ప్రభుత్వమే చెల్లించినట్టు అవుతోంది:

మన ప్రభుత్వం ఇస్తున్న ఈ ప్రోత్సాహకాలతో లబ్దిపొందుతున్న మొత్తం యూనిట్లలోకూడా చూస్తే 62 శాతం ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఉన్నారు:

వీరంతా చిన్న చిన్నవాళ్లు, ఇలాంటి వారికి బకాయిలుపెట్టి, వీరిని గాలికి వదిలేస్తే వీళ్లందరూ కూడా ఎలా బ్రతకగలుగుతారు అన్న ఆలోచన గత ప్రభుత్వం  చేయలేదు :

దాన్ని మారుస్తూ మంచి చేయాలన్న తాపత్రయంతో మనం అడుగులు ముందుకేస్తున్నాం:

ఈరోజు ఈప్రోత్సాహకాలు పొందుతున్న యూనిట్లను గమనిస్తే 42 శాతం అక్క చెల్లెమ్మలవే:

వీళ్లందరూ కూడా ఈ బెనిఫిట్స్‌ రాకపోతే అందరూ కూడా రోడ్డున పడే పరిస్థితి ఉంటుందనే ఆలోచన కూడా ఎప్పుడూకూడా పాలకులకు తట్టలేదు:

మనం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశ్రమల్లో ఇస్తున్న ఉద్యోగాల్లో కూడా 75శాతం చట్టంచేశాం:

ఇవేకాకుండా రూ.25వేలకోట్ల పెట్టుబడులను ఆకర్షించాలనే లక్ష్యంతో కడపజిల్లా కొప్పర్తిలో 3155 ఎకరాల విస్తీర్ణంలో వైయస్సార్‌ జగనన్న మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నాం:

దీనిద్వారా దాదాపు 75వేలకుపైగా ఉపాధి లభిస్తోంది:

కొప్పర్తిలోనే ౖఎలక్ట్రానిక్‌ పరిశ్రమలను ఆకట్టుకునేలా వెయస్సార్‌ ఈఎంసీని స్థాపిస్తున్నాం:

దీనిద్వారా దాదాపు రూ.10వేల కోట్ల పెట్టుబడులు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం:

801 ఎకరాల్లో వైయస్సార్‌ ఎలక్ట్రానిక్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌ను రూ. 730 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్నాం:

దీనిద్వారా అక్కడ మరో 30వేల మందికి వచ్చే 2 ఏళ్లలోపే ఉద్యోగావకాశాలు కల్పించే పరిస్థితి ఉంటుంది:

ఇదే కాకుండా అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లోనే  వైయస్సార్‌ నవోదయం అనే కొత్త స్కీంను తీసుకు వచ్చి బ్యాంకులతో కలిసికట్టుగా పనిచేస్తూ 1,08,292 ఎంఎస్‌ఎంఈ ఖాతాలకు సంబంధించి రూ. 3,236 కోట్ల రూపాయల రుణాలను రీషెడ్యూల్‌ చేశాం:

దీంతోపాటు 2,49,591 ఎంఎస్‌ఎంఈ బ్యాంకు ఖాతాలకు అత్యవసర క్రెడిట్‌ లైన్‌ హామీ పథకాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చి దీనిద్వారా రూ. 5,973 కోట్ల బ్యాంకు రుణాలతో అదనపు వర్కింగ్‌ క్యాపిటల్‌ రుణసదుపాయాన్ని ఏర్పాటు చేశాం:

కష్టకాలంలో కచ్చితంగా తోడుగా నిలబడాలన్న ఆరాటంతో అడుగులు ముందుకేస్తూ తీసుకున్న చర్యలు ఇవి:

మన అందరి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన నాటినుంచి 

రూ.30,175 కోట్ల పెట్టుబడితో 68 భారీ, మెగా పరిశ్రమలు ఉత్పత్తి కూడా ప్రారంభించాయని సగర్వంగా తెలియచేస్తున్నాయి:

ఈ పరిశ్రమల ద్వారా అక్షరాల 46,199 మందికి ఉపాధి లభించింది:

మరో రూ.34,384 కోట్ల పెట్టుబడితో మరో 62 భారీ, మెగా ప్రాజెక్టులు కూడా ప్రారంభం అవుతున్నాయి:

వీటిద్వారా 76,916 మందికి రాబోయే రోజుల్లో ఉపాధి లభిస్తుందని ఈ సందర్బంగా సవినయంగా తెలియజేస్తున్నాను:

అంతేకాకుండా యూనిట్‌కు కేవలం రూ.2.48 మాత్రమే ఖర్చయ్యే విధంగా, మరో 30 సంవత్సరాల పాటు రైతులకు ఉచితంగా, నాణ్యమైన కరెంటును ఎలాంటి ఢోకాలేకుండా ఇచ్చేలా, అదేసమయంలో ప్రభుత్వం ఖర్చును తగ్గించుకుని రైతులకు మంచి జరిగేలా రూ.30వేల కోట్ల పెట్టుబడిని ఆకర్షిస్తూ 10వేల మెగావాట్ల సోలార్‌ను ప్రాజెక్టును ఏర్పాటు చేయబోతున్నాం:

దురదృష్టవశాత్తూ గిట్టనివాళ్లు కోర్టుకు వెళ్లారు :

దీనివల్ల టెండర్లు ఫైనలైజ్‌చేసి పనులు మొదలుపెట్టలేకపోయాం:

కోర్టు తీర్పురాగానే పనులు వేగవంతంగా జరుగుతాయి:

రూ.30వేల కోట్ల పెట్టుబడి రావడమే కాకుండా, రూ.2.48కే యూనిట్‌ కరెంట్‌ అందుబాటులోకి వస్తుంది, దీనివల్ల ప్రభుత్వంపై భారం తగ్గి 30 సంవత్సరాల పాటు రైతులకు ఉచితంగా, నాణ్యమైన కరెంటు అందుతుంది:

మునుపెన్నడూలేని విధంగా పారిశ్రామిక రంగానికి అవసరమైన విద్యుత్తు, రోడ్లు, నీరు... ఈ సదుపాయాలమీద ప్రభుత్వం గట్టిగా దృష్టిసారించింది:

కరెంటు, రోడ్లు, నీళ్లు ఇవి పరిశ్రమలకు అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో పారిశ్రామిక విధానంలో ఈ అంశాలకు ప్రాధాన్యత కల్పించాం:

ప్రభుత్వం ప్రకటించిన పారిశ్రామిక విధానంలో భాగంగా  ఎస్సీలు, ఎస్టీలు, వెనకబడ్డ వారు పరిశ్రమలు స్థాపించేలా వైయస్సార్‌ బడుగు వికాçసం తీసుకు వచ్చాం:

కోటిలోపు పెట్టుబడి పెట్టే ఎస్సీ, ఎస్టీలకు 45శాతం, బీసీ వర్గాలకు 35శాతం పెట్టుబడిలో సబ్సిడీ ఇస్తూ వీరిని ప్రోత్సహించే కార్యక్రమాన్ని చేపట్టాం:

ఇవికాకుండా పవర్‌ సబ్సిడీలు, ల్యాండ్‌ కొనుగోలులో రిబేటు... ఇలాంటి ప్రోత్సహకాలు కూడా ప్రత్యేకించి ఈవర్గాలకు అందిస్తున్నాం:

రాష్ట్రవ్యాప్తంగా వేగవంతమైన అభివృద్ధికోసం విశాఖపట్నం – చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడర్, చెన్నై– బెంగళూరు ఇంస్ట్రియల్‌ కారిడర్, ఇదికాక హైదరాబాద్‌– బెంగళూరు ఇండస్ట్రియల్‌ కారిడర్‌... ఈమూడు ఇండస్ట్రియల్‌ కారిడర్లలో కూడా పూర్తిగా ప్రత్యేక దృష్టిపెట్టి అభివృద్ధిచేస్తున్నాం:

చెన్నై– బెంగుళూరు ఇండస్ట్రియల్‌ కారిడార్‌లో భాగంగా రూ.2139 కోట్ల అంచనా వ్యయంతో దాదాపుగా 13వేల ఎకరాల విస్తీర్ణంలో కృష్ణపట్నం గ్రీన్‌ ఫీల్డ్‌ ఇండస్ట్రియల్‌ నోడ్‌ను అభివృద్ధిచేస్తున్నాం:

ఈ ఒక్క నోడ్‌ద్వారానే దాదాపు లక్ష మందికి ఉపాధి లభిస్తుంది:

ఇవి రాబోయే రోజుల్లో చాలా ఫోకస్డ్‌గా కార్యక్రమాలు చేపడుతున్నాం:

రాష్ట్ర పునర్విభజన చట్టంలో కడపలో స్టీల్‌ప్లాంట్‌ పెడతామని మాట ఇచ్చి కూడా అది, కార్యరూపం దాల్చకపోవడంతో.. కచ్చితంగా ఆశలు నెరవేర్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తనంతటతానుగా అడుగులు ముందుకేసింది:

ప్రయివేటు పార్టీలతో కలిసి అక్కడ ప్లాంట్‌పెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాం:

ఏపీ పునర్విభజన చట్టంలో ప్రస్తావించిన ప్రకారం 3 మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో రాష్ట్ర ప్రభుత్వమే అడుగులు ముందుకేసి కడపజిల్లా సున్నపురాళ్లపల్లిలో దాదాపు రూ.13500 కోట్లతో వైయస్సార్‌ స్టీల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఏర్పాటుచేసి దానికి పనులకు కూడా శ్రీకారం చుట్టడం జరిగింది:

మరో రూ.13వేల కోట్లతో ఈ 2024 నాటికి భావనపాడు, మచిలీపట్నం, రామాయపట్నంలో మూడు గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టుల నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిచేసేలా శ్రీకారం చుట్టాం:

రామాయపట్నం, భావనపాడు పోర్టులకు ఇప్పటికే టెండర్లు పిలవడం జరిగింది:

మచిలీపట్నం పోర్టుకోసం టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది:

ఇవన్నీ కూడా 2024 నాటికి పూర్తిచేసేలా అడుగులు ముందుకేస్తున్నాం:

ఇదికాక రూ. 3,827 కోట్ల వ్యయంతో 2 దశల్లో 9 కొత్త ఫిషింగ్‌హార్బర్లను అభివృద్ధి కూడా చేస్తున్నాం:

మనవాళ్లు జీవనోపాధికోసం పాకిస్థాన్‌ సరిహద్దులకో, బంగ్లాదేశ్‌ సరిహద్దులకో వెళ్తే అక్కడ పట్టుబడితే..., వారిని తీసుకురావడంకోసం నానా అగచాట్లు పడుతున్న పరిస్థితుల్లో మనమే  ఫిషింగ్‌ హార్బర్లను నిర్మించి, వారికి ఉపాథి ఇక్కడే కల్పిద్దామన్న తపన తాపత్రయంతో ఏకంగా రూ,3,827 కోట్లతో 9 ప్రాంతాల్లో ఫిషింగ్‌ హార్బర్లను 2 దశల్లో నిర్మిస్తున్నాం:

శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెం, విశాఖజిల్లా పూడిమడక, తూ.గో.జిల్లా ఉప్పాడ, ప.గో.జిల్లా బియ్యపుతిప్ప, గుంటూరు జిల్లా నిజాంపట్నం, ప్రకాశం జిల్లా వాడరేవు, కొత్తపట్నం, నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె.. ఈ 9 ప్రాంతాల్లో హార్బర్లను డెవలప్‌ చేస్తున్నాం:

ఇప్పటికే నాలుగు హార్బర్ల కోసం టెండర్లు పిలిచి పనులు కూడా మొదలుపెట్టాం:

ఇంకా మిగిలిన ఐదింటికోసం టెండర్ల ప్రక్రియ ప్రారంభిస్తున్నాం:

వీటిద్వారా 76,230 మంది మత్స్యకార సోదరులకు నేరుగా ఉపాధిఅవకాశాలు లభిస్తాయి:

2024 నాటికి పరోక్షంగా 35వేల మందికి హార్బర్ల అనుబంధ పరిశ్రమల వల్ల ఉద్యోగాలు లభిస్తాయి:


ఎయిర్‌పోర్టుల అభివృద్ధిలో భాగంగా మొన్న మార్చి 2021లోనే కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయాన్ని మన ప్రభుత్వం ప్రారంభించింది:

రూ. 3వేల కోట్లతో భోగాపురంలో గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయాన్ని పీపీపీ పద్ధతిలో అభివృద్ధి కూడా చేస్తాం:

దీనిపై కూడా గిట్టనివారు కొంతమంది కోర్టులో కేసులు వేశారు:

వీటిని పరిష్కరించే ప్రయత్నం జరుగుతోంది:

దేవుడి దయతో త్వరలోనే పరిష్కారం అయ్యి, అన్నీ బాగుంటే వచ్చే నెలల్లోనే దానికి శంకుస్థాపన చేసే కార్యక్రమాన్ని చేపడతామనే గట్టి నమ్మకంతో ఉన్నాం:

ఇవన్నీకూడా కాక... గ్రామీణ స్థాయి నుంచి ఉపాధిఅవకాశాలను కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది:

స్వయం ఉపాధి పథకాలైన ఆసారా, చేయూత ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టాం:

అమూల్, ఐటీసీ, హిందుస్థాన్‌ లీవర్, ప్రాక్టర్‌ అండ్‌ గాంబిల్, రియలన్స్‌ ఇలాంటి భారీ సంస్థలతో చేయూత, ఆసరాల లాంటి లబ్ధిదారులను టై అప్‌చేసి, అక్షరాల 1,07,232  మంది అక్కచెల్లెమ్మలకు కిరాణా దుకాణాలు, చిరువ్యాపారాలు పెట్టించడం జరిగింది:

2,65,168 మంది అక్కచెల్లెమ్మలకు అమూల్‌ద్వారా టై అప్‌చేయించడమే కాకుండా ఆవులు, గేదెలు, గొర్రెల పెంపకంద్వారా ఉపాధి కల్పించడమైంది:

మొత్తంగా 3,72,400 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు ఉపాధి కల్పించడమైంది:

జగనన్న తోడు అనే మరో కార్యక్రమం ద్వారా 9.51లక్షల మంది మంది చిరు వ్యాపారులకు సున్నావడ్డీకే రుణాలు ఇప్పించి, ఆవడ్డీ సొమ్మును ప్రభుత్వమే కట్టేట్టుగా ఈ కార్యక్రమాన్ని ఇప్పటికే అమలు చేస్తున్నాం:

ఇది కాక ఇంటివద్దకే రేషన్‌ కార్యక్రమంలో భాగంగా ఒక్కో వాహనానికి రూ.5.8 లక్షల వ్యయంతో 9,260 రేషన్‌ వాహనాలను, డోర్‌డెలివరీ వాహనాలను 90శాతం సబ్సిడీతో అందించాం:

దీనివల్ల 18,525 మందికి ప్రత్యక్షంగా ఒక్కో వాహనానికి ఇద్దరు చొప్పున ఉపాధి కల్పించాం:

నాకుటుంబ సభ్యులైన ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీ సోదరులే దాదాపు 80శాతం మందికి మేలు జరుగుతోంది:

ఇది కాక పార్లమెంటు నియోజకవర్గానికి ఒకటి చొప్పున దాదాపుగా రూ.2500 కోట్ల రూపాయల వ్యయంతో ప్రతి పార్లముంటు నియోజకవర్గానికి 25 సెకండరీ ఫుడ్‌ ప్రాససింగ్‌ యూనిట్లు కూడా ఏర్పాటు చేయబోతున్నాం:

త్వరలోనే వీటికి పనులు ప్రారంభం అవుతాయి:

సెకండరీ ఫుడ్‌ ప్రాససింగ్‌ రావడంలో రైతుల దగ్గరనుంచి ప్రభుత్వం కొనుగోలుచేసే పంటను, ఫుడ్‌ ప్రాససింగ్‌ ద్వారా వాల్యూ ఎడిషన్‌ క్రియేట్‌చేస్తుంది:

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రూ.3 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధికి ఒక వైపున సాధికారితనిస్తూ, మరో 30వేల మందికి ప్రత్యక్షంగానూ, మరో 50 వేల మందికి పరోక్షంగానూ ఉపాధి లభిస్తుంది:

ఇదే విధంగా ఆక్వా ఉత్పత్తుల స్థానిక వినియోగం పెరిగేలా చేసేందుకు 23 ప్రీ ప్రాససింగ్‌యూనిట్లు, మరియు 10 ప్రాససింగ్‌ యూనిట్లు నెలకొల్పుతున్నాం:

వీటితోపాటు 100 హబ్స్‌ను, ప్రతిగ్రామానికీ మత్సు్యత్పత్తులను అందుబాటులోకి తెచ్చేలా 14500 రిటైల్‌ షాపులను ఏర్పాటు చేస్తున్నాం:

వీటిద్వారా అక్షరాల ఆక్వారంగంలో రూ.1200 కోట్ల పెట్టుబడులు పెడుతున్నాం, 1,01,500 మందికి ఉపాధి లభిస్తుంది:


పారిశ్రామిక రంగంపై ర్యాంకింగ్‌లు ఇచ్చేటప్పుడు కేంద్ర ప్రభుత్వం, వరల్డ్‌బ్యాంకు దేశంలో మొట్టమొదటి సారిగా పారిశ్రామిక వేత్తలనుంచి కూడా ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుని ర్యాంకింగ్‌లు ఇచ్చాయి:

స్టేట్‌ బిజినెస్‌రిఫార్మ్‌ యాక్షన్‌ ప్లాన్‌రిపోర్టు జాతీయ ర్యాంకుల్లో మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని చెప్పడానికి గర్వపడుతున్నాను:

పారిశ్రామిక వేత్తలను ఎంతలా సపోర్టు చేస్తున్నామో... నేరుగా పారిశ్రామిక వేత్తలను అడిగి వారి అభిప్రాయాలను కూడా సేకరించి దేశ్యాప్తంగా సర్వే చేపట్టి కేంద్ర ప్రభుత్వం, వరల్డ్‌బ్యాంకు ర్యాంకులను ప్రకటించాయి:

ఇందులో ఏపీకి మొదటి స్థానం రావడం పారిశ్రామిక రంగానికి చెందిన వ్యక్తులకు రాష్ట ప్రభుత్వం మీద ఉన్న విశ్వాసానికి నిదర్శనం:

పెట్టుబడి దారులు అందరూ కూడా మన ప్రభుత్వం మీద ఉంచిన నమ్మకానికి, విశ్వసనీయతకు నిదర్శనం ఇది:

పరిశ్రమలకు అండగా, వ్యవసాయానికి వెన్నుదన్నుగా నిలబడుతున్న మన అందరి ప్రభుత్వానికి దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ప్రజలందరి చల్లనిదీవెనలుకూడా సదా ఉండాలని కోరుకుంటున్నాను:

Popular posts
భారీ గజమాలతో సత్కరించిన అభిమానులు
Image
సంక్షేమ నవశకానికి నాంది నవరత్నాల పథకాలు :
శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ
ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో తీసుకువస్తున్న రిఫార్మ్స్,టెక్నాలజీ వినియోగంలో రాష్ట్రంలోని క్షేత్రస్థాయి అధికారులకు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ట్యాబ్ లను అందజేసిన డి‌జి‌పి గౌతం సవాంగ్ IPS గారు. కార్యక్రమంలో పాల్గొన్న కడప జిల్లా ఎస్పి అన్బురాజన్ IPS .
Image
అక్టోబర్ 30న మెగా జాబ్ మేళా : ఐ.టీ, పరిశ్రమలు , నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
Image