విజయవాడ (ప్రజా అమరావతి);
వైద్యుల నియామకానికి దివ్యాంగ అభ్యర్థుల నుండి దరఖాస్తుల ఆహ్వానం
ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకుల పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సివిల్ అసిస్టెంట్ సర్జన్లుగా రెగ్యులర్ ప్రాతిపదికన నియమించేందుకు దివ్యాంగ (Locomotive disablility Candidates only) అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకులు ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 44 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎంబిబిఎస్ విద్యార్హతతో ఈ ఏడాది జులై 1 నాటికి 42 ఏళ్లలోపు వయస్సున్న వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితి సడలింపు ఉంటుందని వివరించారు. దరఖాస్తులను cfw.ap.nic.in website నుండి డౌన్లోడ్ చేసుకుని, పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 13 నుండి 24 వరకు విజయవాడ, గొల్లపూడిలోని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకుల కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.
(జారీ చేసిన వారు పీఆర్వో, ఎపి వైద్య ఆరోగ్య శాఖ)
addComments
Post a Comment