విజయవాడ(హోటల్ లెమన్) (ప్రజా అమరావతి);
సహకార శాఖకు
డిసిఎంఎస్ , డిసిసిబి లు రెండు కళ్ళు
సీఎం జగన్ పారదర్శకతకు పెద్దపీట వేశారు
బాధ్యత, జవాబుదారీతనం ముఖ్యం
బ్యాంకులకు నష్టపరిచే వాళ్ళని ఉపేక్షించమని సీఎం స్పష్టం చేశారు
రాష్ట్రంలో డిసిసిబి డిసిఎంఎస్ లను అధ్యాయనం చేసేందుకు ఉన్నతాధికారులతో కమిటీ
రాష్ట్రస్థాయి డిసిసిబి , డిసిఎంఎస్ ల సదస్సులో మంత్రి కన్నబాబు
అన్ని జిల్లాల డీసీసీబీలు , డిసిఎంఎస్ ల పనితీరుపై సమీక్ష చేస్తున్న వ్యవసాయ , సహకార , మార్కెటింగ్ , ఫుడ్ ప్రోసెసింగ్ శాఖల మంత్రి కన్నబాబు
డిసిఎంఎస్ , డిసిసిబి ల బలోపేతానికి సీఎం పారదర్శక విధానాలను అమలు చేస్తున్నారు
గత ప్రభుత్వ హయాంలో పలు చోట్ల డిసిసిబి ల్లో చాల అవినీతి జరిగాయి
సీఎం జగన్ ప్రభుత్వం వచ్చాక వ్యవస్థను ఆధునీకరించే పరిస్థితుల్లో గత ప్రభుత్వ కాలంలో జరిగిన అవినీతి వెలుగు చూస్తుంది
బ్యాంకు లు బ్రతకాలి వాటిని నష్టపరిచే పని చేసే ఎవ్వరిని ఉపేక్షించొద్దని సీఎం స్పష్టంగా చెప్పారు
డిసిసిబి చైర్మన్లకు , డిసిఎంఎస్ అధ్యక్షులకు పూర్తి అవగాహన ఉండాలి , ప్రతి అంశంపై పట్టు సాదించాలి
గుంటూరు , కృష్ణా జిల్లాల్లో డిసిసిబిల పనితీరు మిగిలిన జిల్లాలకు ఆదర్శముగా వున్నాయి
డిసిసిబి ల తమ కార్యకలాపాలను విస్తరించాలి
బ్యాంకుల్లో అయిదేళ్ల దాటినా మేనేజర్లను ట్రాన్సఫర్ చేసేలా చర్యలు తీసుకొండి
లాంగ్ టర్మ్ లోన్ల విషయంలో మనం మరింత ఉత్సహముగా పని చేసి రుణ పరిమితులు పెంచేలా ఆలోచనలు చేయాలి
సొసైటీ ల బైఫరికేషన్ , ఇతర మార్పులు చేర్పులు అంశాల్లో ప్రతిపాదనలు చేయండి
మనం ఎంత బాధ్యత గా ఉంటే అంత సంతృప్తికరంగా మన విధులు నిర్వహించవచ్చు
రైతుల డబ్బు ని మనం అత్యంత బాధ్యతగా ఖర్చు చేయాలి
డిసిసిబి , డిసిఎంఎస్ , పాక్స్ కు త్వరలో ఎన్నికలొస్తాయి
కంప్యూటరీజషన్ పనులు వేగవంతం చేసి త్వరలోనే పూర్తి చేయాలి
సీఎం ఆదేశాల మేరకు కౌలు రైతులకు రుణాలు ఇతర సేవలనందించే దిశగా చర్యలు తీసుకోవాలి
బ్యాంకు ల లావాదేవీలను చెక్ అండ్ బాలన్స్ చేసేలా
ఆడిటింగ్ వ్యవస్థ ను పూర్తిగా
ప్రక్షాళన చేయాలి
వ్యవస్థ లో పని చేసే సిబ్బంది కోసం , వ్యవస్థ బలోపేతం కోసం హెచ్ ఆర్ పాలసీ ని సక్రమంగా అమలు చేయాలి
ఆర్థిక స్థోమత వుండి కూడా రుణాలు తీసుకొని అప్పులు చెల్ల్లించని రుణగ్రస్తులపై ప్రత్యేక శ్రద్ద చూపించి రికవరీలు చేయాలి
తొలిదశలో చిత్తూర్ , ప్రకాశం , పశ్చిమ గోదావరి , గుంటూరు, కడప జిల్లాల్లో అముల్ ప్రాజెక్ట్ లకు మన బ్యాంకుల నుంచి రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలి
జిల్లాల్లోని బ్యాంకుల్లో పెండింగ్ కేసులు , వాటి విచారణ , అప్కోబ్ , ఆర్ సి ఎస్ , ప్రభుత్వం నుంచి తీసుకున్న చర్యలపై చర్చించిన మంత్రి కన్నబాబు
డిసిసిబి బ్యాంకుల చైర్మన్లు
రుణాల విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి ఎలాంటి వత్తిడిలకు తలొగ్గద్దనే సీఎం ఆదేశాలను గుర్తించుకొండి
జిల్లాల వారీగా డిసిసిబిల పనితీరు , రికవరీ రేటు , రుణాల విస్తరణ , సిబ్బంది పర్యవేక్షణ , ఆడిటింగ్ వ్యవస్థ తదితర అంశాలను సమీక్షించిన మంత్రి
డిసిసిబి, డిసిఎంఎస్ పదవులని రాజకీయ పదవులగా చూడద్దు
సహకార వ్యవస్ధ బలోపేతంలో డిసిసిబి, డిసిఎంఎస్ లు అత్యంత కీలకం
సహకార వ్యవస్ధని పూర్తిగా ప్రక్షాళన చేసి బలోపేతం చేస్తామని పాదయాత్రలో వైఎస్ జగన్ హామినిచ్చారు
బ్యాంకింగ్ రంగాన్ని పటిష్టం చేయడంలో డిసిసిబి చైర్మన్లు, డిసిఎంఎస్ చైర్మన్ల పాత్ర ప్రధానం
గత ప్రభుత్వం సహకార వ్యవస్దని పూర్తిగా అవినీతిమయం చేశారు
తూర్పుగోదావరి జిల్లాలో రెండు చోట్ల తప్పుడు పత్రాలతో కోట్లాది రూపాయిలు దిగమింగేశారు
ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రెండు చోట్లా కుంభకోణాలని వెలికి తీసాం
సహకార రంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది
బ్యాంకులని నష్టపరిచే చర్యలని ఉపేక్షించవద్దని సిఎం వైఎస్ జగన్ ఆదేశించారు
* బ్యాంకింగ్, ఆర్ధిక రంగంలో నిపుణులని పిఎసిఎస్, డిసిసిబిలలో డైరక్డర్లగా తీసుకునేలా చట్టంలో మార్పులు చేస్తున్నాం
* సహకార వ్యవస్ధని సంస్కరించేలా అందరం కలిసికట్టుగా పనిచేయాలి
* పిఎసిఎస్ సెక్రటరీలు, బ్యాంకు ఉద్యోగులకి త్వరలో ట్రాన్స్ ఫర్లు చేయనున్నాం
* ఉద్యగుల జీతభత్యాలని సరిచేస్తాం
* రైతుకి అప్పుకావాలంటే కోఆపరేటివ్ బ్యాంకులే గుర్తుకు రావాలి
సొసైటీ బైఫరికేషన్ త్వరలోనే పూర్తి చేస్తాం
పిఎసిఎస్ లలో రికార్డుల ట్యాంపరింగ్ అతి పెద్ద లోపంగా కనిపిస్తోంది
సొసైటీలు కంప్యూటీకరణ చేయకపోవడం వల్ల అక్రమాలు జరుగుతున్నాయి
రుణాల మంజూరులో చేతివాటానికి పాల్పడే వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలి
కౌలు రైతులకి ఇతర జాతీయ బ్యాంకుల కంటే ఎక్కువగా రుణాలివ్వాలి
రాష్ట్రంలోని అన్ని డిసిసిబి డిసిఎంఎస్ లను అధ్యాయనం చేసేందుకు ఉన్నతాధికారులతో కమిటీ వేయాలని ఆదేశాలు
అప్కోబ్ చైర్మన్ మల్లెల జాన్సీ రాణి , మార్కెఫెడ్ చైర్మన్ నాగిరెడ్డి ,
ప్రిన్సిపాల్ సెక్రటరీ మధుసూదన్ రెడ్డి , ఆర్ సి ఎస్ కమిషనర్ అహ్మద్ బాబు , మార్కెటింగ్ కమీషనర్ ప్రద్యుమ్న ,అప్కోబ్ ఎం డి శ్రీనాద్ రెడ్డి ఇతర ఉన్నాతాధికారులు పాల్గొన్నారు
addComments
Post a Comment