వాడవాడలా "వై ఎస్ ఆర్ " కి ఘన నివాళి

 


కొవ్వూరు (ప్రజా అమరావతి);


వాడవాడలా "వై ఎస్ ఆర్ " కి ఘన నివాళి


ప్రజల గుండెల్లో ఇప్పటికి ఎప్పటికి గుర్తుండే నాయకుడు" వైఎస్ఆర్" - మంత్రి తానేటి వనిత


బడుగు, బలహీన వర్గాల బంధావుడు మహానేత వైఎస్సార్ వర్ధంతి ని  రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు  ప్రతి ఒక్కరూ ఆయన అందించిన సంక్షేమ పథకాలను స్మరించుకుంటున్నారని రాష్ట్ర మహిళాభివృద్ది, శిశు , వయోవృద్ధుల, దివ్యంగుల సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.  గురువారం ఉదయం కొవ్వూరు మెయిన్ రోడ్డు లోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి మంత్రి వర్యులు,  కొవ్వూరు మునిసిపల్ ఛైర్ పర్సన్ బావన రత్నకుమారి , పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి  పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, 

వాడ వాడల వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. ఆరోగ్యశ్రీ, రైతులకు ఉచిత విద్యుత్, జలవనరుల ప్రాజెక్ట్ ల చేపట్టిన అపర భగీరథుడు గా ప్రజల్లో నిలిచారు. ఈ రోజు పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసే దిశలో ఉందంటే అందుకు ప్రధాన కారణం డా. వై ఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నారు.

ముఖ్యమంత్రి గా ఐదు సంవత్సరాలు 5 నెలల కాలం పనిచేసి, 12 సంవత్సరాలు అయినా ఇప్పటి కి ప్రజల గుండెల్లో ఉన్నారంటే, ఆయన చేసిన  సంక్షేమ పరిపాలనే కారణమని మంత్రి తానేటి  వనిత అన్నారు. వైఎస్సార్ కి ఇంత పెద్ద ఎత్తున నివాళులు అర్పించడం ఆయన చేసిన సంక్షేమ పథకాలను తెలియచేస్తోందన్నారు. తన తండ్రి ఆశయాలు ప్రజల్లోకి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొనసాగించడం, అంతకు మించి పధకాలను రూపొందించి అమలు చేయడం  కూడా వై ఎస్ రాజశేఖర్ రెడ్డి నేటికీ ప్రజలు స్మరించుకోవడానికి కారణం అని మంత్రి పేర్కొన్నారు.   తండ్రికి తగ్గ తనయుడిగా ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి మరిన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆమె తెలిపారు. అంతకుముందు మంత్రి తానేటి వనిత  క్యాంపు కార్యాలయంలో మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి భోజన పేకట్లను పంపిణీ చేశారు. మంత్రి పర్యటనలో భాగంగా కొవ్వూరు వాటర్ ట్యాంక్ నందు గల,  విజయవిహార్ సెంటర్ లో గల వైస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి మంత్రి నివాళులు  అర్పించారు. తదుపరి  కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఫ్రూట్స్ పంపిణీ ,  వాత్స్యల్య వృద్ధాశ్రమం నందు వృద్ధులకు పళ్ళు పంపిణీ , వస్త్ర దానం కార్యక్రమాలలో పాల్గొన్నారు. మంత్రి వెంట కొవ్వూరు మునిసిపల్ ఛైర్ పర్సన్ బావన రత్నకుమారి, కౌన్సిలర్లు , స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.