*"తెలుగుదేశం నాటి పాపాలు, అధికారుల పాలిట శాపాలు"*
*శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు (ప్రజా అమరావతి); జిల్లాలో సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి విలేకరుల సమావేశం.*
తెలుగుదేశం ప్రభుత్వం కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా, కోర్టు ధిక్కారానికి పాల్పడడంతో కోర్టు ముందు అధికారులు దోషులుగా నిలబడవలసిన పరిస్థితి.
నెల్లూరు జిల్లాలో 2015 సంవత్సరంలో దివ్యాంగుల నైపుణ్య, పునరావాస ప్రాంతీయ కేంద్రం మంజూరైంది.
దివ్యాంగుల పునరావాస కేంద్రానికి ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం స్థలాన్ని గుర్తించమని ఆదేశాలు ఇవ్వడంతో, అధికారులు 10 ఎకరాల స్థలాన్ని ప్రతిపాదించడం జరిగింది.
తెలుగుదేశం ప్రభుత్వంలో దివ్యాంగుల పునరావాస కేంద్రానికి ప్రతిపాదించిన 10 ఎకరాల స్థలంలో, తనది మూడు ఎకరాల స్థలం ఉందంటూ తాళ్ళపాక సావిత్రమ్మ పలు దఫాలు విజ్ఞప్తి చేసినా, తెలుగుదేశం ప్రభుత్వంలో ఆమె గోడు పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
దళిత మహిళ సావిత్రమ్మ తనకు అన్యాయం జరిగిందంటూ, తన 3 ఎకరాల భూమికి నష్టపరిహారం ఇప్పించమని లోకయుక్తను, ఆ తర్వాత ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం ఫిబ్రవరి 10, 2017 న సావిత్రమ్మకు నష్ట పరిహారం చెల్లించాలంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది.
కోర్టు ఆదేశానుసారం నష్ట పరిహారం చెల్లించాలంటూ అధికారులు అనేక సార్లు ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళినా, పట్టించుకోకుండా పెడచెవిన పెట్టారు.
తాళ్ళపాక సావిత్రమ్మ కోర్టు ఆదేశాలు పట్టించుకోవడం లేదంటూ, ఫిబ్రవరి 06, 2018 సంవత్సరం నాడు కోర్టు ధిక్కార పిటిషన్ వేసింది.
కోర్టు ధిక్కార పిటిషన్ వేసిన తర్వాత కూడా, 14 నెలలు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కోర్టు ఉత్తర్వులను ఏమాత్రం ఖతరు చేయలేదు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత మహిళ తాళ్లపాక సావిత్రమ్మ కు న్యాయం జరిగింది.
తాళ్ళపాక సావిత్రమ్మ కు చెందిన 3 ఎకరాల భూమి కి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎకరాకు 13 లక్షల చొప్పున, 39 లక్షలు చెల్లించింది.
తెలుగుదేశం ప్రభుత్వం చేసిన తప్పును కొంతమంది దురుద్దేశంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై రుద్దడానికి ప్రయత్నించడం దుర్మార్గం.
ఉన్నత స్థాయిలో పనిచేసి పదవీ విరమణ చేసిన విశ్రాంత ఐఏఎస్ అధికారులు పూర్తి వివరాలు తెలుసుకోకుండా, పత్రికా ప్రకటనలు విడుదల చేయడం సమంజసం కాదు.
తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన తప్పును వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సరిదిద్దినా, ఆ పాపాన్ని మాకు అంటగట్టడానికి ప్రయత్నించడం అన్యాయం.
తెలుగుదేశం ప్రభుత్వం పొరపాట్ల వలనే అధికారులకు న్యాయస్థానం జైలుశిక్ష, జరిమానా విధించింది.
తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లకు ఆనాటి పాలకులను నిలదీయాల్సినది పోయి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పై విమర్శలు గుప్పించడం క్షమించరాని నేరం.
పవిత్రమైన పాత్రికేయ వృత్తిని అవలంబించేవారు, నిజానిజాలు తెలుసుకొని వాస్తవాలను ప్రజలకు అందించాలి.
addComments
Post a Comment