తాడేపల్లి (ప్రజా అమరావతి);
*- 2024లో కుప్పం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ ఏ అసెంబ్లీలో అడుగుపెట్టాలి.*
*-బిసి కులాల్లో మహిళలు కూడా నేతలుగా ఎదగాలనేది శ్రీ వైయస్ జగన్ ఆకాంక్ష.*
*- రాష్ట్రం అప్పులు పాలవుతోంది, సంక్షేమ పథకాలు ఆగిపోతాయంటూ టిడిపి, పచ్చమీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి.*
*- వన్యకుల క్షత్రియ ఆత్మీయ సమావేశంలో శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి*
2024లో కుప్పం నియోజకవర్గం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ ఏ ఘన విజయం సాధించేలా పనిచేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ నేత దివంగత చంద్రమౌళి తనయుడు భరత్ జెయింట్ కిల్లర్ గా అసెంబ్లీలో అడుగుపెట్టాలని అన్నారు. చంద్రబాబుకు సర్పంచ్ ఎన్నికల నుంచే కుప్పంలో కౌంట్ డౌన్ ప్రారంభమైందని అన్నారు. తాడేపల్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వన్యకుల క్షత్రియ కమ్యూనిటీ రాష్ట్ర స్థాయి సమావేశానికి వన్యకుల క్షత్రియ ఛైర్‌పర్సన్ శ్రీమతి కె.వనిత శ్రీను అధ్యక్షత వహించారు. సమావేశంలో శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. కుప్పం టిడిపి కోటను బ్రధ్దలు కొట్టుకుని ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ ఎంతగా ప్రజల హృదయాలలో చొచ్చుకుని పోయారనేందుకు సర్పంచ్ ఎన్నికలలో విజయమే తార్కాణంగా నిలుస్తుందని సజ్జల అన్నారు. సర్పంచ్ ఎన్నికల విజయాలను యువనేత భరత్ కొనసాగించాలని కోరారు.
భారతీయ సమాజంలో అసమానతలైనా... ఆర్ధికాభివృధ్ది అయినా.... సాంస్కృతిక అభివృధ్ది అయినా... కులాల ఆధారంగా జరుగుతాయనేది అందరూ అంగీకరించాల్సిన వాస్తవం. వెనకబడిన బిసి కులాలను ప్రోత్సహించాలనే సదుధ్దేశ్యంతో దివంగత వైయస్ రాజశేఖరరెడ్డిగారు బిసి కులాలకు సంబంధించి ఫెడరేషన్లను ఏర్పాటు చేశారన్నారు. వైయస్ జగన్ గారు మరో అడుగు ముందుకు వేసి బిసి అధ్యయన కమిటిని నియమించి బిసి కులాల్లో వెనకబడిన కులాలను గుర్తించారని తెలిపారు. వాటికి గుర్తింపు ఇవ్వాలనే ఉధ్దేశ్యంతో బిసి డిక్లరేషన్ ప్రకటించారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బిసి కార్పోరేషన్లను ఏర్పాటుచేశారన్నారు. బిసి కులాల్లో కూడా మహిళలను అన్ని విధాలా అభివృద్దిపధంలోకి తీసుకురావాలనే వారికి పదవులలో అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని తెలియచేశారు. చంద్రబాబు బిసి కులాలను ఆదరణ పేరుతో వారిని వృత్తులకే పరిమితం చేస్తూ కత్తెర్లు, తాపీపనిముట్లు, ఇస్త్రిపెట్టెలు మాత్రమే ఇస్తూ అందులో కుంభకోణాలకు పాల్పడుతూ ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచినట్లే బిసికులాలకు కూడా వెన్నుపోటు పొడిచారన్నారు. బిసిలను కేవలం ఓటుబ్యాంకుగానే కాకుండా వారిని సమాజంలో ఉన్నతవర్గాలతో సమానంగా అభివృధ్దిలోకి తీసుకురావాలనే ధృఢసంకల్పంతో జగన్ ఉన్నారన్నారు.
ఇటీవల ప్రతిపక్షాలు, పచ్చమీడియా కలసి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు రాకూడదు....కేంద్రం నుంచి నిధులు రాకూడదని దుష్టపన్నాగాలు పన్నుతూ ....ఆర్ధిక సంక్షోభం ....అని దుష్ప్రచారం సాగిస్తున్నాయని విమర్శించారు. తిరిగి వీళ్లే సంక్షేమ పథకాలలో ప్రభుత్వం కోత విధిస్తున్నారంటూ అడ్డగోలు వాదన చేస్తున్నారని అన్నారు. అయితే ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన భాద్యత అందరిపై ఉందన్నారు. శ్రీ వైయస్ జగన్ రాష్ట్రంలో పేదవర్గాలు, ముఖ్యంగా బిసి, ఎస్సి, ఎస్టి, మైనారిటీలలో పేదరికాన్ని పొగొట్టే లక్ష్యంతో పనిచేస్తుంటే టిడిపి, బిజేపి, పచ్చమీడియా కలసి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు.
వన్యకుల క్షత్రియులు తమ సమస్యలను తామే పరిష్కరించుకునేలా వన్యకుల క్షత్రియ కార్పోరేషన్ లో నియమితులైన నేతలు పనిచేయాలన్నారు. ఇప్పుడు కార్పోరేషన్ ఏర్పాటు ద్వారా వారు ప్రభుత్వంలో భాగమనే విషయాన్నివారు గుర్తించాలని కోరారు. సామాజిక సంక్షేమం వర్ధిల్లాలన్నా...రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృధ్ది చెందాలన్నా....కులాలు, మతాలకు అతీతంగా అభివృధ్ది జరగాలన్నా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, శ్రీ వైయస్ జగన్ అధికారంలో ఉండాలి అనే ధృఢసంకల్పంతో వన్యకుల క్షత్రియులు పనిచేయాలన్నారు.
రాజ్యసభ సభ్యులు శ్రీ మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ....* వన్యకుల క్షత్రియ కులస్ధులు మాట తప్పని వ్యక్తులని, వారంతా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నారని అన్నారు. కుప్పం నియోజకవర్గంలో అత్యధికమంది వన్యకుల క్షత్రియులు ఉన్నారని వారికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని అన్నారు. వారిని రాజకీయంగా ప్రోత్సహించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో వన్యకుల క్షత్రియ కార్పోరేషన్ ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. బిసిలకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉధ్దేశ్యంతో చిన్నచిన్నకులాలకు కూడా కార్పోరేషన్లను ఏర్పాటుచేశారన్నారు. ఛైర్మన్లు, డైరక్టర్లుగా నియమితులైనవారు కేవలం విజిటింగ్ కార్డులకే పరిమితం కాకుండా ఆయా కులాల్లో పేదరికాన్ని పారద్రోలి వారి అభివృధ్దికి పనిచేయాలన్నారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు. కుప్పం నియోజకవర్గంలో 40 ఏళ్ళ ఇండస్ట్రీ అయిన చంద్రబాబు వన్యకుల క్షత్రియుల సెంటిమెంట్ గా భావించే ధర్మరాజు దేవాలయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నారు.
పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ శ్రీ లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ....* బిసి కులాల అభ్యున్నతే లక్ష్యంగా గత కొద్దిరోజులుగా బిసి కులాల ఆత్మీయ సమావేశాలు ఏర్పాటుచేస్తున్నామని తెలియచేశారు. ఆయా కులాల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
కుప్పం నియోజకవర్గంలో ధర్మరాజు దేవాలయాన్ని అభివృధ్ది పరిచే విషయంలో రాజ్యసభ సభ్యులు శ్రీ మోపిదేవి వెంకటరమణతో కలసి ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ దృష్టికి తీసుకువెళ్తానని శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశంలో ప్రకటించారు.*
*సమావేశంలో ఎమ్మెల్సీ శ్రీ దువ్వాడ శ్రీనివాస్, నవరత్నాల అమలు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ వైస్-చైర్మన్ శ్రీ అంకంరెడ్డి నారాయణ మూర్తి, కుప్పం నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త శ్రీ కె.ఆర్.జె.భరత్ గారు, వన్యకుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్లు మరియు పార్టీ నేతలు, తదితరులు పాల్గొన్నారు.*
addComments
Post a Comment