రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ శ్రీ రేపాల శ్రీనివాసరావుని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ శ్రీ హరేంధిర ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు


నెల్లూరు, సెప్టెంబర్ 6 (ప్రజా అమరావతి) : రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ శ్రీ రేపాల శ్రీనివాసరావుని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ శ్రీ హరేంధిర ప్రసాద్  మర్యాదపూర్వకంగా కలిశారు


. సమాచార హక్కు చట్టం దరఖాస్తుల పరిశీలన నిమిత్తం మూడు రోజుల నెల్లూరు పర్యటనకు విచ్చేసిన ఆర్టీఐ కమిషనర్ ను సోమవారం ఉదయం కలెక్టరేట్లోని శంకరన్ సమావేశ మందిరంలో   ఇంచార్జ్ కలెక్టర్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.