చిత్తూరు జిల్లా పరిషత్ (ప్రజా అమరావతి);
*శనివారం నూతనంగా ఎన్నిక కాబడ్డ చిత్తూరు జిల్లా ప్రజా పరిషత్ గౌరవ సభ్యులతో ప్రత్యేక సమావేశం నందు జిల్లా పరిషత్ చైర్మన్ గా వి.కోట జడ్పీటీసీ గోవిందప్ప శ్రీనివాసులు(వాసు) పేరు
ను పులిచెర్ల జడ్పీటీసీ మురళీధర్ ప్రతిపాదించగా, కురబలకోట జడ్పీటీసీ బైసాని జ్యోతి బలపరచారు...*
*మొదటి వైస్ చైర్మన్ గా యర్రావారి పాలెం జడ్పీటీసీధనుంజయరెడ్డి పేరు ను సదుం మండల జడ్పీటీసీ సోమశేఖర్ రెడ్డి ప్రతి పాదించగా,యర్రావారి పాలెం జడ్పీటీసీ కరుణాకర్ రెడ్డి బల పరిచారు..*
*రెండవ వైస్ చైర్మన్ గా గుడిపాల జడ్పీటీసీ ఆర్.రమ్య పేరు ను వడమాల పేట మండలం జడ్పీటీసీ మురళీధర్ ప్రతి పాదించగా, నారాయణ వనం జడ్పీటీసీ సుమన్ కుమార్ బల పరిచారు...*
*చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు ఏకగ్రీవం అయినందున గోవిందప్ప శ్రీనివాసులు జిల్లా పరిషత్ చైర్మన్ గా, బి.ధనుం జయ రెడ్డిని మొదటి వైస్ చైర్మన్ గా,ఆర్. రమ్య రెండవ వైస్ చైర్మన్ గా ఎన్నిక అయినట్లు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి యం. హరినారాయణన్ ప్రకటించారు...*
*అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్ లు ప్రమాణ స్వీకారం చేశారు..*
*జిల్లా పరిషత్ ప్రత్యేక ఆహ్వానితుడు గా వి.కోట మండలం నకు చెందిన ఎస్.ఎ. గౌస్ ను ఎన్నిక చేసినట్లు చేర్మన్ ప్రకటించారు.
*ఈ కార్యక్రమంలో గౌ. రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి కె.నారాయణ* *స్వామి,గౌ.పంచాయతీ రాజ్ గ్రామీణాభి వృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి,గౌ. రాజంపేట, చిత్తూరు పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిధున్ రెడ్డి, ఎన్.రెడ్డెప్ప, గౌ. పీలేరు,చిత్తూరు, తం బల్ల పల్లి, శ్రీ కాళహస్తి, సత్యవేడు, పలమ నేరు,మదనపల్లి శాసన సభ్యులు చింతల రామచంద్రా రెడ్డి,ఆరణి శ్రీనివాసు లు,పెద్దిరెడ్డి ద్వారక నాథ రెడ్డి,బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఆదిమూలం,వెంకటే గౌడ్, నవాజ్ బాషా, ఎమ్మెల్సీ యండ పల్లి శ్రీనివాసుల రెడ్డి పాల్గొన్న గా, వీరితో పాటు డి సి సి బి చైర్మన్ రెడ్డమ్మ,గౌ. టిటిడి పాలక మండలి సభ్యులు పోకల అశోక్ కుమార్, గౌ.రాష్ట్ర జాన పద కళల అభివృద్ధి సంస్థ చైర్మన్ కొండవీటి నాగ భూషణం,గౌ.పుంగ నూరు,కుప్పం, మదన పల్లి నగర అభివృద్ధి చైర్మన్ వెంకట్ రెడ్డి యాదవ్,జిల్లా జాయింట్ కలెక్టర్ లు (రెవెన్యూ, ఆసరా) రాజాబాబు,రాజ శేఖర్,డి ఆర్ ఓ మురళి,జడ్పీ సీఈఓ ప్రభాకర్ రెడ్డి,డిపి ఓ దశరథ రామి రెడ్డి, జడ్పీటీసీ లు, అధి కారులు,అనది కారులు తదితరులు పాల్గొన్నారు.*
addComments
Post a Comment