జిల్లాలో పెండింగ్లో ఉన్న స్పందన అర్జీలను వచ్చే వారం లోగా పరిష్కరించాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శ్రీ హరెందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు

.                    నెల్లూరు,  సెప్టెంబర్ 6 (ప్రజా అమరావతి):---  జిల్లాలో పెండింగ్లో ఉన్న స్పందన అర్జీలను వచ్చే వారం లోగా పరిష్కరించాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శ్రీ హరెందిర  ప్రసాద్ అధికారులను ఆదేశించారు


.  సోమవారం నగరంలోని కలెక్టరేట్  తిక్కన ప్రాంగణంలో జిల్లా  ఇన్చార్జి కలెక్టర్ స్పందన కార్యక్రమం నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. అంతకుమునుపు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ జిల్లా అధికారులతో స్పందన కార్యక్రమం పై సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ  స్పందన అర్జీల పరిష్కారం పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.  ముఖ్యంగా పెండింగ్లో ఉన్న 270 పరిష్కారం గడువు దాటిన అర్జీల  పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.అందులో ప్రధానంగా గ్రామ,వార్డు  సచివాలయాల పరిధిలో 159,   మున్సిపల్ పాలన పరిధిలో 39, రెవెన్యూ విభాగంలో 16 అర్జీలు, ఇతర శాఖల్లో కొంతమేరకు గడువు దాటి అర్జీలు పెండింగ్లో  ఉన్నాయన్నారు. వాటన్నిటిని తక్షణమే పరిష్కరించాలని సూచించారు. తాగునీటి సరఫరా,  విద్యుత్ దీపాల కు సంబంధించి వచ్చే అర్జీలను  మరుసటి రోజు లోగా తప్పనిసరిగా పరిష్కరించాలని,  గడువు దాటి ఉండరాదని స్పష్టం చేశారు.  ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్లు శ్రీ గణేష్ కుమార్, శ్రీ విదేహ్ ఖరే, ,ఇంఛార్జి సంయుక్త కలెక్టర్ ఐసిడిఎస్ పీడీ శ్రీమతి రోజ్ మాండ్, తెలుగు గంగ ప్రత్యేక కలెక్టర్ శ్రీ నాగేశ్వర రావు,  జడ్పీ సీఈఓ శ్రీమతి పి సుశీల, డిఆర్డిఎ,  డ్వామా పీడీలు శ్రీ సాంబశివ రెడ్డి శ్రీ తిరుపతయ్య , డి పి ఓ  శ్రీమతి ధనలక్ష్మి , డి ఈ ఓ శ్రీ రమేష్, డి ఎస్ ఓ శ్రీ వెంకటేశ్వర్లు, సాంఘిక సంక్షేమశాఖ డిడి శ్రీ దేవ పుత్ర కుమార్, నీటిపారుదల శాఖ ఎస్ ఈ శ్రీ కృష్ణ మోహన్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడి శ్రీ హనుమాన్ ప్రసాద్ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Comments