బహిరంగ మద్య సేవనాన్ని నిర్మూలించండి.

 

   తాడేపల్లి (ప్రజా అమరావతి);


బహిరంగ మద్య సేవనాన్ని నిర్మూలించండి.



      --రాష్ట్ర డీ.జి.పీ గౌతమ్ సవాంగ్ కు మద్య విమోచన ప్రచార కమిటీ విజ్ఞప్తి.


ఆంధ్రప్రదేశ్ లో గ్రామాలలోని,పట్టణాలలో బహిరంగ మద్యసేవనం గణనీయంగా పెరుగుతుందని దీని ఫలితంగా మహిళలపై అత్యాచారాలు, హత్యలు,

దొంగతనాలు,దోపిడీలు,ఘర్షణలు ఎక్కువవుతున్నాయని పబ్లిక్ స్థలాలలో,బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవనాన్ని సమూలంగా నిర్మూలించడానికి ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేయాలని ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఈ నెల 22వ తేదీన సాయంత్రం 05:00 గంటల సమయంలో తాడేపల్లిలోని రాష్ట్ర డిజిపి కార్యాలయంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ ను కలసి వినతి పత్రం అందజేశారు.ఈనెల 8వ తేదీన మేడికొండూరు మండలం పాలడుగు వద్ద జరిగిన అత్యాచార దుర్ఘటన కూడా బహిరంగ ప్రదేశంలో నలుగురు యువకులు త్రాగి ఉండటమే కారణమని తెలుస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు సమూలంగా నిర్మూలించడానికి బహిరంగ మద్య సేవనం పై యుద్ధం ప్రకటించాలని పోలీసు యంత్రాంగాన్ని అంతా కదిలించి ఈ వైపు దృష్టి సారించాలని కోరారు. పబ్లిక్ న్యూసెన్స్ కేసు కు బదులుగా కఠినమైన శిక్షలు పడే విధంగా చట్టంలో మార్పులు తీసుకోని రావాలని కోరారు.గ్రామ సచివాలయలలో వున్న మహిళా పోలీసులకు పోలీస్ యూనిఫాం ను అందించి ఉద్యోగ నియమావళిలో బహిరంగ మద్య సేవనాన్ని అరికట్టడం ఒక బాధ్యతగా పేర్కొన్నాలని తెలిపారు.పోలీసు యంత్రాంగం, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, డ్వాక్రా మహిళలు,మహిళా సంఘాల నేతల సహకారం తీసుకుని బహిరంగ మద్య సేవనాన్ని అరికట్టడం ప్రధాన కర్తవ్యంగా తీసుకోవాలని కోరారు.గ్రామీణ ప్రాంతాలలో కూడా అవసరమైన చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ను మరింత పటిష్ట పరచడం ద్వారా నాటుసారా, అక్రమ మద్యం, గంజాయి లాంటి మత్తు పానీయాలను నిరోధించాలి. మద్య విమోచన ప్రచార కమిటీ కార్యక్రమాలలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ను 

భాగస్వాములను చేయాలని కోరారు.


                ఇట్లు

             అచ్యుత్

              పి ఆర్ ఓ

మద్య విమోచన ప్రచార కమిటీ

      రాష్ట్ర కార్యాలయం

         8790005577

Comments