విశాఖపట్నం (ప్రజా అమరావతి);
విశాఖపట్నంజిల్లాలో సీజనల్ వ్యాధులు నివారణకు ముందోస్తు జాగ్రత్తలపై అధికారులతో సమీక్షించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని
..
రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు విస్తరంగా కురుస్తున్న క్రమంలో సీజనల్ వ్యాధులు సోకకుండా నివారణకు ముందోస్తు జాగ్రత్తలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం...
విష జ్వరాలు బారిన పడకుండా ప్రజలకు ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ముందోస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పం...
విశాఖపట్నంలో VMRDA చిల్డ్రన్స్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం మధ్యాహ్నం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని గారు అధ్యక్షతన సీజనల్ వ్యాధులు నివారణపై ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులు వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షా సమావేశం...
పాల్గొన్న రాష్ట్ర మంత్రులు కురసాల కన్నబాబు,గారు అవంతి శ్రీనివాస్ గారు జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున పార్లమెంట్ సభ్యులు శాసన సభ్యులు వివిధ శాఖల అధికారులు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు...
రాష్ట్ర వ్యాప్తంగా విష జ్వరాలు డెంగ్యూ మలేరియా ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి గారు అదేశాలు మేరకు సమీక్ష ఏర్పాటు చేసాం...
విశాఖపట్నం జిల్లాలో ప్రజలను అధికారులను ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తూ విష జ్వరాలు నివారణకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని గారు సూచన...
ప్రతి ఏడాది కురుస్తున్న వర్షాలు మాదిరిగానే ఈ ఏడాది కూడ ఎక్కువగా వర్షాలు కురుస్తున్న క్రమంలో ప్రజలకు ఆరోగ్య రక్షణ ప్రాణ రక్షణ కల్పించాలని ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి గారు లక్ష్యం...
విష జ్వరాలు ఎక్కువుగా నమోదు అవుతున్న ప్రాంతాలు గుర్తించి ప్రణాళిక బద్దంగా నివారణ చర్యలు చేపట్టాలని అధికారులకు విజ్ఞప్తి చేసిన మంత్రి ఆళ్ల నాని గారు...
రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టడం వల్ల విశాఖపట్నం జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసాం...
జిల్లాలో 462డెంగ్యూ కేసులు 708మలేరియా, చికెన్ గున్యా 24కేసులు నమోదు అయినట్టు పేర్కొన్న మంత్రి ఆళ్ల నాని గారు...
అర్బన్ ప్రాంతాల్లో ఎక్కువుగా డెంగ్యూ కేసులు నమోదు అవుతున్న దృష్ట్యా మరిన్ని నివారణ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన మంత్రి ఆళ్ల నాని గారు...
వర్షా కాలంలో ఇళ్ల పరిసర ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వ లేకుండా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి...
ఏజెన్సీ ప్రాంతంలో మలేరియా ప్రబలకుండా ముందోస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున కు సూచించిన మంత్రి ఆళ్ల నాని...
అంటు వ్యాధులు ప్రబలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని సమర్ధవంతంగా పని చేసిన అన్ని శాఖల అధికారులను అభినంధించిన మంత్రి ఆళ్ల నాని గారు...
సీజనల్ వ్యాధులు అదుపులో ఉండేలా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని మంత్రి ఆళ్ల నాని గారు విజ్ఞప్తి...
వైస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాడు నేడు కింద రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ అభివృద్ధి చేస్తున్నాం...
పేద ప్రజలు వద్దకు కార్పొరేట్ వైద్యం అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ఆశయం...
విశాఖపట్నం జిల్లాలో ఇంటింటికి సర్వే చేసి విష జ్వరాలు ఉన్నవారిని గుర్తించి సమీపంలో ఉన్న హాస్పిటల్ లో మెరుగైన వైద్యం అందించడానికి చర్యలు చేపట్టాలి...
ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ సచివాలయం సిబ్బంది, వైద్యసిబ్బంది, ఆశా వర్కర్స్, వాలంటీర్లు అంటు వ్యాధులు ప్రబలకుండా ఎక్కువుగా ఫోకస్ పెట్టాలని సూచించిన మంత్రి ఆళ్ల నాని గారు...
విష జ్వరాలు సోకిన వారికి తక్షణమే మెరుగైన వైద్యం అందించడానికి జిల్లా యంత్రాంగం, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి...
మారుమూల ప్రాంతాల్లో పంచాయతీ రాజ్ అధికారులు సిబ్బందిని సమన్వయము చేసుకుంటూ విష జ్వరాలపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలి...
కేసులు ఎక్కువుగా ఉన్న ప్రాంతంలో 5లక్షలు వరకు దోమలు తెరలు అందించి మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకు రావాలి...
ప్రజలు అవసరం మేరకు వ్యాధులు ఎక్కువగా ఉన్న ఏరియాల్లో మెడికల్ క్యాంపు లు పెట్టి మందులు అందుబాటులో ఉంచాలి...
ప్రజలకు అంటు వ్యాధులు పట్ల అవగాహన కల్పించాలి...
దోమలు నివారణకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి...
ఇళ్ల పరిసరాలల్లో వ్యర్థ పదార్ధాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజలను భాగస్వామ్యం చేయాలి...
డెంగ్యూ, మలేరియా ఎక్కువగా ప్రాంతంలో లార్వా అభివృద్ధి కాకుండా డ్రైన్స్ పరిశుభ్రంగా ఉంచాలి...
డెంగ్యూ మలేరియా పరీక్షలు చేయడానికి అవసరమైన పరిక్షా కేంద్రాలు సిద్ధం చేసుకోవాలి...
వచ్చే నెలలో మళ్ళీ రివ్యూ జరిగే నాటికి విష జ్వరాలు పూర్తిగా అదుపులో ఉండేలా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి...
addComments
Post a Comment