వ్యాధి నిరోధక శక్తిని పెంచే మందులను వృద్ధులందరికీ అందించే ప్రయత్నం చేయండి



- వ్యాధి నిరోధక శక్తిని పెంచే మందులను వృద్ధులందరికీ అందించే ప్రయత్నం చేయండి 


- వైసీపీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్ 

- వృద్ధులకు హెమియో మందుల పంపిణీ 



గుడివాడ , సెప్టెంబర్ 2 (ప్రజా అమరావతి): గత రెండేళ్ళుగా కరోనా సంక్షోభం కొనసాగుతూ వస్తోందని , ఈ నేపథ్యంలో ముఖ్యంగా వృద్ధులకు వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఘోమియో మందులను అందించే ప్రయత్నం చేయాలని వైసీపీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్ అన్నారు . గురువారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలోని ప్రాంతీయ హెూమియో పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలో రోగ నిరోధక ఆయుష్ ఔషధాల పంపిణీ , ఆహారం , జీవనశైలి నిర్వహణ మార్గదర్శకాలకు సంబంధించి వృద్ధుల జనాభా పై ప్రత్యేక దృష్టితో ఆయుష్ వారోత్సవాలను గత 30 వ తేదీ నుండి నిర్వహిస్తున్నారు . ఈ సందర్భంగా జరిగిన సభలో వైసీపీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు . ఆధునిక ప్రపంచంలో పురాతన పద్ధతులకు ప్రాధాన్యత తగ్గిందని , దీంతో ఆహారపు అలవాట్లు కూడా మారిపోయాయన్నారు . జంక్ ఫుడ్ కు దగ్గరయ్యామని , రానురానూ ప్రజలు రోగాల బారిన ఎక్కువగా పడుతున్నారన్నారు . పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం నేపథ్యంలో ప్రతి జబ్బుకూ స్పెషలిస్ట్ డాక్టర్లు కూడా వస్తున్నారన్నారు . ఎటువంటి జబ్బులు రాకుండా తీసుకోవాల్సిన ఆహారం , సరైన జీవనశైలిని అలవర్చుకోవాలన్నారు . హెూమియో వైద్యానికి గుడివాడ పట్టణం ఎంతో ప్రాచుర్యం పొందిందన్నారు . ఇక్కడి రీసెర్చ్ సెంటర్లో తెల్లకార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఉ చితంగానే వైద్యం అందుతుందన్నారు . స్కానింగ్ వంటి ఖరీదైన పరీక్షలను కూడా ఉచితంగానే నిర్వహిస్తున్నారని చెప్పారు . ముఖ్యంగా వృద్ధుల ఆరోగ్యం విషయంలో అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారని కొనియాడారు . ఆయుష్ వారోత్సవాల్లో భాగంగా వృద్ధులకు వ్యాధి నిరోధక శక్తిని పెంచే మందులను అందించడం అభినందనీయమన్నారు . ఇటువంటి మందులను ఇంటింటికీ కూడా వెళ్ళి వృద్ధులకు దగ్గరుండి ఇవ్వడం , వారికి కరోనా వంటి ఎటువంటి వైరస్లు దరిచేరనివ్వకుండా చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు . రాష్ట్ర ప్రభుత్వం కూడా వైద్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు . గుడివాడ పట్టణంలో 27 వైఎస్సార్ హెల్త్ క్లినిక్లు , మూడు అర్బన్ హెల్త్ క్లినిక్ లను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు . వీటిలో ఏఎన్ఎంలు , డాక్టర్లకు ప్రత్యేక క్వార్టర్స్ కూడా ఉంటాయన్నారు . పేదలకు 24 గంటల పాటు వైద్యం అందేలా సీఎం జగన్మోహనరెడ్డి చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు . రూ . వెయ్యి దాటిన ప్రతి వైద్య ఖర్చునూ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చారని చెప్పారు . అనంతరం వృద్ధులకు వ్యాధి నిరోధక శక్తికి పెంచే మందులను పంపిణీ చేశారు . ఈ మందులను కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వారు కూడా వాడవచ్చన్నారు . వ్యాక్సిన్ వేయించుకున్న రోజు మాత్రం వాడరాదన్నారు . ఎటువంటి ఆహార నియమాలు లేవన్నారు . మందులు వేసుకున్న 30 నిమిషాల పాటు ఎటువంటి ఆహారం తీసుకోరాదన్నారు . వచ్చే డిసెంబర్ నెల వరకు ఈ మందులను ఇంటింటికీ అందించే ఏర్పాట్లు చేసిన వైద్యులను దుక్కిపాటి అభినందించారు . అనంతరం దుక్కిపాటిని సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ ఘనంగా సత్కరించారు . వృద్ధులకు యోగా ఎలా చేయాలో నేర్పించారు . ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పీజే సంపత్ కుమార్ , వైద్యులు రాజు , డాక్టర్ బృందా , మాజీ కౌన్సిలర్ పోలాసి వాసుదేవరావు , యోగా ఇనస్ట్రక్టర్ లీలావతి తదితరులు పాల్గొన్నారు .

Comments