అమరావతి (ప్రజా అమరావతి);
*వ్యవసాయరంగంపై సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష*
*రాష్ట్రంలో వర్షపాతం, పంటలసాగు, ఇ–క్రాపింగ్, వ్యవసాయ సలహామండళ్ల సమావేశాలు, ఎరువుల పంపిణీ, వ్యవసాయ విస్తరణ కార్యక్రమాలు, ఆర్బీకేల నిర్మాణ ప్రగతి తదితర అంశాలపై సీఎం సమీక్ష*
– రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం వివరాలను, సాగు వివరాలను సీఎంకు వివరించిన అధికారులు
– రాష్ట్రవ్యాప్తంగా ఇవ్వాళ్టి వరకూ సాధారణ వర్షపాతం 403.3 మిల్లీ మీటర్లు కురవాల్సి ఉండగా, ఇప్పటివరకూ 421.7 మిల్లీమీటర్లు కురిసిందని వెల్లడించిన అధికారులు
– నెల్లూరు మినహా అన్నిజిల్లాల్లో సాధారణ లేదా అధిక వర్షపాతం నమోదయ్యిందన్న అధికారులు
– ఖరీఫ్‌లో ఇవ్వాళ్టి వరకూ 76.65లక్షల ఎకరాల్లో సాగు కావాల్సి ఉండగా, ఇప్పటివరకూ 67.41 లక్షల ఎకరాల్లో సాగయ్యిందని తెలిపిన అధికారులు
– వర్షాలు బాగా కురుస్తున్నందున మిగిలిన చోట్లకూడా వేగంగా విత్తనాలు వేస్తున్నారన్న అధికారులు
*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైఎస్ జగన్ ఏమన్నారంటే...*
*చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేలా చర్యలు*
– చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలని సీఎం ఆదేశం
బోర్లకింద, వర్షాధార భూములలో చిరుధాన్యాలు సాగుచేసేలా ప్రోత్సహించాలన్న సీఎం
వరికి బదులు చిరుధాన్యాలు సాగుచేసినా ఆదాయాలు బాగా వస్తాయన్న అంశంపై రైతుల్లో అవగాహన కల్పించాలన్న సీఎం
ఇలా చేస్తున్న రైతులను ప్రోత్సహించడానికి తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం
చిరుధాన్యాల సాగుచేస్తున్న రైతులకు మంచి గిట్టుబాటు ధర వచ్చేలా భరోసా కల్పించాలని, దీనివల్ల రైతులు మరింత ముందుకు వస్తారన్న సీఎం
*వ్యవసాయ సలహామండలి సమావేశాలు*
– వ్యవసాయ సలహామండళ్ల సమావేశాలు జరుగుతున్న తీరుపైనా సీఎం సమీక్ష
రైతులతో ఏర్పడ్డ వ్యవసాయ సలహామండళ్లలో వ్యక్తంచేస్తున్న అభిప్రాయాలు, సమస్యలు నేరుగా కలెక్టర్ల దృష్టికి వెళ్లాలన్న సీఎం
వాటిని వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం
డ్రైయిన్లు సహా ఇరత్రా పనులపై ఇప్పుడే వివరాలు తెప్పించుకుని దీనికి తగిన కార్యాచరణ సిద్ధంచేసుకోవాలన్న సీఎం
రైతులు చెప్తున్న సమస్యలను తీర్చే బాధ్యత కచ్చితంగా అధికారులు తీసుకోవాలని, దీనిపై దృష్టిపెట్టాలన్న సీఎం
వ్యవసాయ సలహామండళ్ల కారణంగా సత్ఫలితాలు ఇస్తున్నాయన్న అధికారులు
మార్కెట్లో డిమాండ్‌లేని వంగడాలను నిరుత్సాహ పరచడానికి సలహామండళ్లు కీలక పాత్ర పోషించాయన్న అధికారులు
సుమారు లక్ష మందికిపైగా రైతులు వ్యవసాయ సలహామండళ్లలో ఉన్నారన్న అధికారులు
*రైతు భరోసా కేంద్రాలు – సేవలు*
– రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులు కోరిన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలను నిర్దేశిత సమయంలోగా అందాలని స్పష్టంచేసిన సీఎం
రైతు భరోసాకేంద్రాల పనితీరు, సామర్థ్యం ఆమేరకు మెరుగుపడాలన్న సీఎం
నాణ్యత ఉన్నవాటిని రైతులకు అందించడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్న సీఎం
– ఆర్బీకే కేంద్రాల ద్వారా కూడా రైతుల సమస్యలు నేరుగా ఉన్నతస్థాయికి తెలిసే వ్యవస్థనుకూడా సిద్ధంచేయాలన్న సీఎం
అత్యాధునిక పరిజ్ఞానాన్ని (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) దీనికి వినియోగించుకోవాలన్న సీఎం
– నేచురల్ ఫార్మింగ్‌పైనా రైతులకు అవగాహన కల్పించాలన్న సీఎం
నేచురల్ ఫార్మింగ్‌విధానాలను డిస్‌ప్లే చేయాలన్న సీఎం
దీనికి సంబంధించిన సామగ్రి కావాలంటే వెంటనే రైతులకు అందుబాటులోకి తీసుకురావాలన్న సీఎం
– ఆర్బీకే కేంద్రాలకు అనుబంధ భవనాలను విస్తరించుకుంటూ చిన్నపాటి గోడౌన్లను ఏర్పాటు చేసుకోవాలన్న సీఎం
అక్కడే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను నిల్వచేసుకోవచ్చన్న సీఎం
భవనాలను విస్తరించి నిర్మించేంతవరకూ అద్దె ప్రాతిపదికన కొన్ని భవనాలు తీసుకోవాలన్న సీఎం
– డిసెంబరులో వైయస్సార్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ ప్రారంభం
– ఆర్బీకేల పనితీరుమీద కూడా సర్టిఫికెషన్ ఉండాలన్న సీఎం
ఆర్బీకేల పనితీరుపె నిరంతర పర్యవేక్షణ, సమీక్షఉండాలన్న సీఎం
ఆర్బీకేల పనితీరును మెరుగుపరిచే దిశగా ఐఎస్‌వో సర్టిఫికేషన్ పొందే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించిన సీఎం
దీనివల్ల వాటి పనితీరు క్రమంగా మెరుగుపడుతుందన్న సీఎం
ఎప్పటికప్పుడు ఎస్‌ఓపీలను రూపొందించుకోవాలన్న సీఎం
*వైయస్సార్ పొలంబడి*
– వైయస్సార్ పొలంబడి కార్యక్రమంపైనా సీఎం సమీక్ష
పొలంబడి కార్యక్రమాల షెడ్యూలును రైతు భరోసాకేంద్రాల్లో ఉంచాలన్న సీఎం
15 రకాల పంటలపై పొలంబడి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్న సీఎం
అగ్రికల్చర్‌కాలేజీలు, యూనివర్శిటీ విద్యార్థులు ఆర్బీకేల్లో విధిగా పనిచేసేలా చూడాలన్న సీఎం
*ఆర్గానిక్ ఉత్పత్తులకు సర్టిఫికేషన్*
– ఆర్గానిక్‌వ్యవసాయ ఉత్పత్తులకు సర్టిఫికేషన్ వచ్చేలా చూడాలన్న సీఎం
ఇలాంటి ఉత్పత్తులకు మంచి ధర వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్న సీఎం
మోతాదుకు మించి అధికంగా ఎరువులు, పురుగు మందులు వాడుతున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్న సీఎం
ఆర్బీకే యూనిట్లుగా మ్యాపింగ్‌చేసి ఆక్కడ రైతులకు పొలంబడుల ద్వారా ప్రత్యేక శిక్షణ, అవగాహన కల్పించాలన్న సీఎం
– పంటల సాగులో రైతులకు అవగాహన కల్పించేలా రూపొందించిన వీడియోలను యాప్ ద్వారా అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశం
*ఇ– క్రాపింగ్‌పైనా సీఎం సమీక్ష*
ఇ–క్రాపింగ్ చేసిన రైతులకు భౌతిక రశీదులు, డిజిటల్ రశీదులు కూడా ఇవ్వాలని స్పష్టంచేసిన సీఎం
– ఇ– క్రాపింగ్‌పై ప్రత్యేక దృష్టిపెట్టాలన్న సీఎం
దీనివల్ల పూర్తి పారదర్శకత వస్తుందన్న సీఎం
రుణాలు, సున్నావడ్డీ, ఇన్‌పుట్ సబ్సిడీలు, పంటల కొనుగోలు, బీమా... తదితర వాటన్నింటికీ ఇ–క్రాపింగ్ ఆధారం అవుతుందన్న సీఎం
– అన్ని ఆర్బీకేల్లో బ్యాకింగ్ కరస్పాండెంట్లు ఉండాలన్న సీఎం
– కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లలో భారీ పరికరాలను, సామగ్రిని అందుబాటులో ఉంచడమే కాకుండా ప్రతి ఆర్బీకే పరిధిలో కూడా రైతులకు అవసరమైన పనిముట్లను వ్యక్తిగతంగా అందించేలా కార్యాచరణ సిద్ధంచేయాలన్న సీఎం, వచ్చే రబీ సీజన్‌లో అందుబాటులోకి తీసుకురావాలని సూచన
– హార్టికల్చర్‌లో విద్యార్హతలు ఉన్నవారు సరిపడా లేకపోవడంతో గ్రామ సచివాలయాల్లో ఉన్న 2038 పోస్టులు ఖాళీ
అగ్రికల్చర్ అభ్యర్థులతోనే వీటిని భర్తీచేయడానికి సీఎం అంగీకారం
వీరికి ఉద్యానవన పంటలపై తగిన శిక్షణ ఇవ్వాలని సీఎం ఆదేశం
– సీఎంయాప్ వినియోగంపై సచివాలయాల్లో సిబ్బందికి పూర్తిపరిజ్ఞానం ఉండాలన్న సీఎం
ఆమేరకు శిక్షణ, అవగాహన కల్పించాలన్న సీఎం
– నాణ్యతా ప్రమాణాలు, కోత అనంతరం చర్యలు, వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యత మెరుగుకోసం ఆర్బీకే సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖను ఆదేశించిన సీఎం
*ట్రాన్స్‌ఫార్మర్‌ల సమస్యలు – పరిష్కారం*
– ఎక్కడ ట్రాన్స్‌ఫార్మర్‌కాలిపోయినా వెంటనే కొత్త ట్రాన్స్‌ఫార్మర్ పెట్టాలని సీఎం ఆదేశం
– ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయిన చోట లోడ్, ఇతరత్రా పరిస్థితులపై వెంటనే పరిశీలన చేయాలన్న సీఎం
– ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోవడానికి కారణాలపైన కూడా అధ్యయనం చేయాలన్న సీఎం
– లేకపోతే కొత్తగా ట్రాన్స్‌ఫార్మర్ పెట్టినా ఉపయోగం ఉండదన్న సీఎం.
– మీటర్లు అమర్చడంద్వారా ఎంత కరెంటు కాలుతుంది, ఎంత లోడ్‌పడుతుందనే విషయం తెలుస్తుందన్న సీఎం
– మీటర్ల వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేవన్న విషయం ఇప్పటికే పలుమార్లు స్పష్టంచేశామన్న సీఎం
– మీటర్ల వల్ల ఓ వర్గ మీడియాకు తప్ప, రైతులెవ్వరికీ నష్టంలేదన్న సీఎం. ఈవిషయాన్ని రైతులుకూడా గుర్తించి మీటర్లు పెట్టించుకునేందుకు ముందుకు వచ్చారని గర్తుచేసిన సీఎం.
– మీటర్ల కారణంగా అధికారుల్లో జవాబుదారీతనం వస్తుందని, ఎంత లోడ్ పడుతుందని తెలుస్తోందని, దీనివల్ల ట్రాన్స్‌ఫార్మర్లు సహా మోటార్లు కాలిపోయిన పరిస్థితులను నుంచి బయటపడతామన్న అధికారులు.
– ఎంత బిల్లు కట్టాలో అంత డబ్బునూ ప్రభుత్వమే నేరుగా రైతుల ఖాతాల్లోకి వేస్తోందని, ఆ డబ్బు నేరుగా కరెంటు పంపిణీ సంస్థలకు చేరుతోందన్న సీఎం.
– తమకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని విషయాన్ని రైతులు గ్రహించారన్న సీఎం
– రైతులకు నిరంతర విద్యుత్, సరఫరా, నాణ్యమైన విద్యుత్ సరఫరాకోసం ఇప్పటికే ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుందన్న సీఎం
– దీనికోసం ఫీడర్లను కూడా పెద్ద సంఖ్యలో విస్తరించామన్న సీఎం.
– రైతులకు అవాంతరాల్లేని కరెంటుకోసం, ఉచిత విద్యుత్‌కోసం 10వేల మెగావాట్ల సోలార్ ప్రాజెక్టును కూడా తీసుకొస్తున్నామన్న సీఎం.
– గ్రామ సచివాలయాల్లోని ఎనర్జీ అసిస్టెంట్ సేవలను అ విషయంలో వాడుకోవాలన్న సీఎం
– జిల్లా స్ధాయి వ్యవసాయ సలహా మండలి ప్రతినిధులతో రాష్ట్రస్ధాయిలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశం
ఈ సమీక్షా సమావేశానికి వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ప్రభుత్వ సలహాదారు (వ్యవసాయం) అంబటి కృష్ణారెడ్డి, ఏపీ స్టేట్ ఆగ్రో డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బుక్కపట్నం నవీన్ నిశ్చల్, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, జెడ్‌బీఎన్‌ఎఫ్ స్పెషల్ సీఎస్ టి.విజయ్‌కుమార్, వ్యవసాయశాఖ కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్, మార్కెటింగ్ శాఖ కమిషనర్ పి.ఎస్.ప్రద్యుమ్న, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్, ఏపీఎస్‌ఎస్‌డీసీఎల్ వీసీ మరియు ఎండీ గెడ్డం శేఖర్‌బాబు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
addComments
Post a Comment