స్వలాభం కోసం అధికార దుర్వినియోగం చేసి అర్హత లేని వ్యక్తులకు అక్రమముగా మ్యుటేషన్ చేసి పాస్ బుక్ ల కొరకు

      ప్రకాశం జిల్లా  (ప్రజా అమరావతి);


*Cr.No. 382/2021 U/S 409, 467, 468, 477 (A) IPC of Markapur Town P.S.*


*ముద్దాయి:* పల్లెపోగు విద్యసాగరు s/oలక్ష్మయ్య, వయస్సు 60 సం., SC మాదిగ కులము, హుసింగ్ బోర్డు కాలనీ, భాగ్యనగర్ 4 వలైన్, దామచెర్ల ఆంజనేయులు Polytechnic కాలేజీ దగ్గర, ఒంగోలు,  (రిటైర్డ్ తహసిల్దార్).


స్వలాభం కోసం అధికార దుర్వినియోగం చేసి అర్హత లేని వ్యక్తులకు అక్రమముగా మ్యుటేషన్ చేసి పాస్ బుక్ ల కొరకు


  రికమండ్  చేసిన మార్కాపురం రిటైర్డ్ తహసిల్దార్ అరెస్ట్. 


*వివరణ:* మార్కాపురం మండల పరిధిలోని భూములకు అధిక ధరలు అవటముతో, ఎటువంటి ఆధారాలు లేని ప్రభుత్వ భూమిని ఇతరుల పేర్ల తో మార్చి, అధిక డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో గతంలో MRO గా పని చేసిన, మరియు ఆ సమయంలో తన క్రింది సిబ్బంది అయిన ARI, సర్వేయర్ మరియు 13 మంది VRO లు, డేటా ఎంట్రీ ఆపరేటర్ లు అందరూ కలిసి మార్కాపురం మండల మరిదిలోని Ac 387.89 Cents భూమిని మ్యుటేషన్ చేసే క్రమంలో అర్జీ దారులు ఇచ్చిన ఆర్జీలను VRO, MRI లతో కలిసి, సక్రమంగా పరిశీలించకుండా భూమి మీదకు వెళ్లి, ఆ భూమి ఎవరి సాగులో ఉంది, ఎవరికీ ఆ భూమికి సంబందిచిన డాకుమెంట్స్ ఉన్నవి అని చూడకుండా,  అసంబద్ధంగా వ్యవహరించి, ఎవరైతే అధికారులకు వ్యక్తిగత లబ్ది చేకూరుస్తారో వారికి మాత్రమె మ్యుటేషన్ చేయడం.


ప్రభుత్వ అస్సైన్మెంట్ భూములను, అస్సైన్మెంట్ చేయని భూమలను, కొండ పోరంబోకు, వాగు/చెరువు పోరంబోకు, కుంట పోరంబోకు భూములను  మ్యుటేషన్ చేసే క్రమంలో, ఎటువంటి పరిశీలించకుండా, గతంలో అస్సైన్మెంట్ ల్యాండ్ కు సoబందించి, ఎవరెవరికి పట్టాలు ఇచ్చింది, ప్రస్తుతం ఆ ల్యాండ్ ఎవరి పొజిసన్ లో ఉన్నది, అని భూమి మీదకు వెళ్లి, పరిశీలించకుండా, ప్రభుత్వ భూములను ఎలాంటి సబ్ డివిజన్ చేయకుండా, ఇచ్చిన DK పట్టాలు,  ఒరిజినలా కావా, అని పరిశీలించకుండా ఎవరైతే అర్జీ దారులు, అర్జీ పెట్టుకున్నారో, వారికి అసంబద్దంగా, అక్రమార్జన కోసం మ్యుటేషన్ చేయడం.


 అంతే కాకుండా, వెబ్ ల్యాండ్ లో others గా చూపబడుతున్న ప్రభుత్వ భూములను, పట్టా భూములను మరియు అస్సైన్మెంట్ భూములను కొంతమంది రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ సృష్టించిన ఫేక్ డాకుమెంట్స్ ను పరిశీలించకుండా, అక్రమార్జన కోసం వారు ఇచ్చిన ఆర్జీలను, అన్ రిజిస్టర్డ్ అగ్రిమెంట్స్, నోటరీస్ మరియు కుటుంభ సభ్యుల బాగ పంపకాల అగ్రిమెంట్స్ లను సరిగా పరిశీలించకుండా, సంబంధిత అధికారి యొక్క అనుమతి లేకుండా, అసంబద్దంగా వ్యవహరిస్తూ మ్యుటేషన్ కు వచ్చిన ఆర్జీలను సర్వేయర్ కు పంపి, భూమి మీద పోజిసన్ లో ఎవరు ఉన్నారో పరిశీలించకుండా, అర్జీదారుల యొక్క వాటా పరిశీలించకుండా, పాత MRO గారు Bio Metric thumb ను దుర్వినియోగం చేస్తూ, స్వలాభం కోసం, కొందరు అధికారుల ఒత్తిడిలు, మరియు రాజకీయ నాయకుల ఒత్తిడిలతో, వచ్చిన ధరకస్తులను సరిగ్గా పరిశీలించగా కూడా స్వలాభం కోసము అట్టి భూములను మ్యుటేషన్ చేసి పాస్ బుక్ లకు రికమెండ్ చేసి మార్కాపురం మండల పరిధిలో దాదాపు 702.01 ఎకరాల భూమికి గాను 378.89 ఎకరాల భూమిని  irregular గా mutations చేసినారు. సదరు విషయంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు, స్పెషల్ కలెక్టర్ గారి ద్వారా ఎంక్వయిరీ చేపించి, సదరు ఎంక్వయిరీ లో పాత MRO, తన కింది స్థాయి సిబ్బంది సహాయంతో ఈ నేరమునకు పాల్పడినట్లు నిర్ధారించుకొని,  ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు, ప్రస్తుత MRO గారికి ఇచ్చిన ఉత్తర్వులు మేరకు, ప్రస్తుత MRO గారు ఇచ్చిన రిపోర్ట్ మేరకు కేసు నమోదు చెయ్యటం అయినది.


సదరు నేరమును సవాలుగా తీసుకున్న ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గార్గ్ IPS గారి ఆదేశాల మేరకు, మార్కాపురం DSP, డాక్టర్ M. కిశోర్ కుమార్ గారి పర్యవేక్షణలో,  మార్కాపురం i/c ఇన్స్పెక్టర్ శ్రీ MD ఫిరోజ్ గారు, మార్కాపురం పట్టణ ఎస్.ఐ Y. నాగ రాజు గారు లకు రాబడిన సమాచారం మేరకు, వారి  సిబ్బంది తో కలిసి ఒంగోలు లోని ముద్దాయి ఇంటి వద్ద అదుపులోనికి తీసుకొని, అరెస్ట్ చెయ్యటం అయినది. అరెస్టు అయిన ముద్దాయిని గౌరవ AJFCM కోర్ట్, మార్కాపురం వారి వద్ద కు రిమాండ్ నిమిత్తం పంపవలసి ఉన్నది.

Comments