శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
, విజయవాడ (ప్రజా అమరావతి): శ్రీ అమ్మవారి భక్తుల భద్రత దృష్ట్యా కొండ చరియలు విరిగిపడు అవకాశము ఉండు ప్రదేశములు గుర్తించి, ప్రమాద నివారణ మరియు తీవ్రత ను తగ్గించుటకు తగు చర్యలు చేపట్టుటకు గాను గతంలో నిపుణుల బృందము సమర్పించిన నివేదిక మేరకు ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ ఆనుకునియున్న మరియు ఇతర కొండ ప్రాంతమునకు ఫెన్సింగ్, కేబుల్ మరియు హైడ్రో సీడింగ్ మరియు ఇతర పనుల పురోగతి మరియు నాణ్యతను పరిశీలించుటకు గాను ఈ రోజు అనగా ది.12-09-2021వ తేదిన శ్రీ MR మాధవ్, ప్రొఫెసర్, ఐఐటీ కాన్పూర్(visiting professor, IIT హైదరాబాద్), శ్రీ GL శివకుమార్ బాబు గారు, IISC, బెంగుళూరు మరియు శ్రీ త్రిమూర్తి రాజు గారు, జియాలజిస్ట్ ఐఐటీ చెన్నై మరియు శ్రీ అప్పారావు, ఐఐటీ చెన్నై వార్లతో కూడిన నిపుణుల బృందము విచ్చేసి జరుగుచున్న కొండ భద్రత పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి డి.భ్రమరాంబ గారు, కార్యనిర్వాహక ఇంజినీరు శ్రీ డి.వి.భాస్కర్ గారు, ఆలయ ఉప కార్యనిర్వాహక ఇంజినీరు శ్రీమతి ఎల్.రమా గారు, మరియు ఇతర ఇంజినీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు. కార్యనిర్వాహక ఇంజినీరు వారు జరుగుచున్న కొండ భద్రత పనుల గురించి నిపుణుల బృందం వారికి వివరించగా, నిపుణుల బృందం వారు సదరు పనుల గురించి ఆలయ అధికారులకు సూచనలు చేయడం జరిగినది.
addComments
Post a Comment