నవంబరు 14న తిరుపతిలో జరుగనున్న 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశ ఏర్పాట్లపై సిఎస్ సమీక్ష.
అమరావతి,28 అక్టోబరు (ప్రజా అమరావతి): నవంబరు 14న తిరుపతిలో జరుగనున్న 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశ ఏర్పాట్లపై గురువారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకు సియం సమావేశ మందిరంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ వివిధ శాఖల కార్యదర్శులతో సమీక్షించారు.
ఈసమావేశంలో సిఎస్ సమీర్ శర్మ మాట్లాడుతూ వివిధ శాఖల పరంగా తీసుకోవాల్సిన ఏర్పాట్లపై సమీక్షించడంతో పాటు పలు అంశాలపై ఆయన ఆదేశాలు జారీ చేశారు.
ఈసమావేశంలో ఎస్ ఆర్ సి ముఖ్య కార్యదర్శి ఎల్ ప్రేమచంద్రారెడ్డి,శాంతి భద్రతల ఎడిజి రవిశంకర్,ముఖ్య కార్యదర్శులు అనిల్ కుమార్ సింఘాల్,యంటి కృష్ణ బాబు, జయలక్మి, సమాచార శాఖ కమీషనర్ టి.విజయకుమార్ రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు తదితర అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment