రెండో విడత గా వై ఎస్సార్ ఆసరాగా రూ.46.32 కోట్లు అందిస్తున్నాం..నిడదవోలు (ప్రజా అమరావతి);నిడదవోలు నియోజకవర్గంలో రూ.185.25 కోట్ల మేర ఆసరా చేయూత


రెండో విడత గా వై ఎస్సార్ ఆసరాగా రూ.46.32 కోట్లు అందిస్తున్నాం.. మంత్రి తానేటి వనిత


జగనన్న ఇచ్చిన మాటకు కట్టుబడి, మహిళలకు అన్నగా, పిల్లల మేనమామ గా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.


బుధవారం నిడదవోలు పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వై ఎస్సార్ ఆసరా రెండో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస నాయుడుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, మహిళలు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు గా నిలబడాలని ఆకాంక్షించారన్నారు. ఆ దిశలోనే అన్ని సంక్షేమ పథకాలు మహిళలు పేరునే ఇవ్వడం జరుగుతోందన్నారు. ప్రతి ఇంటిలో జగనన్న అందించిన సంక్షేమ పథకాలు లో కనీసం ఒకటి రెండు పథకాల ప్రయోజనం పొందని వారు ఉండరంటే  అతిశయోక్తి కాదన్నారు. అనునిత్యం మన కోసం ఆలోచించే జగనన్న వెంట మనం నడవాలి, మరిన్ని సంక్షేమ పథకాలను అందుకోవాలని తెలిపారు. కోవిడ్ పరిస్థితి లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నా, వేరవకుండా పేదల పక్షన్న నిలిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం 2014 లో అధికారంలోకి రావడానికి మహిళల రుణమాఫీ చేస్తామని చెప్పి, 5 సంవత్సరాలు బ్యాంక్ అధికారులను ఇంటిపైకి పంపించి వడ్డీకి, చక్ర వడ్డీ కట్టించుకున్న రు. జగనన్న రుణాలు బ్యాంకుకి చెల్లించండి, మీ అప్పులు నేను తిరుస్తాను అని హామీ ఇచ్చి 4 విడతల్లో భాగం గా నేడు రెండో విడత అందిస్తున్నామని పేర్కొన్నారు. దిశా చట్టం తీసుకుని వొచ్చు మహిళలకు భరోసా కల్పించే చట్టం కేంద్రం వద్ద పెండింగ్ లో ఉందన్నారు. ఈ లోగా దిశా యాప్ తీసుకుని రావడంతో వ్యక్తి గత భద్రత కి భరోసా ఇచ్చారన్నారు. ప్రతి మహిళా ఈ యాప్ వారి ఫోన్స్ లో డౌన్లోడ్ చేసుకోవాలని మంత్రి కోరారు.


నిడదవోలు శాసన సభ్యులు జి. శ్రీనివాస నాయుడు మాట్లాడుతూ, వైఎస్సార్ ఆసరా పథకం మహిళ లకు ఆర్ధిక భరోసాను కల్పింస్తోందన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తిత్వం వైఎస్సార్ కుటుంబ నేపధ్యం అన్నారు. పాదయాత్ర సమయం లో ప్రజల ఇబ్బందులు దగ్గిర నుండి చూసి మనసున్న నాయకుడిగా అధికారంలోకి వొచ్చిన వెంటనే అక్క చెల్లమ్మ లు చెల్లించిన డ్వాక్రా రుణాలు తిరిగి వారి బ్యాంకు ఖాతాలను జమ చేస్తానని చెప్పారని, నేడు చేతల్లో అది చూపుతున్నారన్నారు. మొత్తం నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని  4,815 గ్రూపులకు 11.4.2019 న ఉన్న అప్పు   రూ.  185.25 కోట్ల ఉందన్నారు.  తొలి విడత సొమ్మును గతేడాది సెప్టెంబర్ 11న ఇచ్చామన్నారు. ఈ దఫా రెండో విడతగా రూ.46.32  కోట్లు విడుదల చేయడం జరిగిందని శాసనసభ్యులు శ్రీనివాస నాయుడు పేర్కొన్నారు. ఇందులో భాగంగా నిడదవోలు మండలం పరిధిలోని ..1438 గ్రూపులకు  ఉన్న అప్పు   రూ.  48.09  కోట్ల లో రెండో విడతగా రూ.12.03 కోట్లు విడుదల చేయడం జరిగింది. నిడదవోలు పురపాలక సంఘం  పరిధిలోని 546 గ్రూపులకు 11.4.2019 న ఉన్న అప్పు   రూ. 17.04 కోట్ల లో రెండో విడతగా రూ. 4.27  కోట్లు విడుదల చేయడం జరిగింది.మునిసిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, పి. డి, మెప్మా బొడ్డు ఇమ్మానియోల్, వైస్ చైర్మన్ లు. జి. వేంకట లక్ష్మీ,  యలగాడ బాల రాజు, మునిసిపల్ కమిషనర్ కెవి పద్మావతి, వార్డు స భ్యులు, జెడ్పిటిసిలు స్థానిక ప్రజా ప్రతినిధులు ,  డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు.


Comments