కొవ్వూరు / వాడపల్లి (ప్రజా అమరావతి) ;
వాడపల్లి గ్రామంలో రైతులకు సబ్సిడీపై పవర్ ట్రిల్లర్లు అందిస్తున్నాము..
రైతులకు రూ.27.90 లక్షల ఖరీదు చేసే 15 పవర్ ట్రిల్లర్లు అందచేత
మంత్రి తానేటి వనిత
మనది రైతు, మహిళా సంక్షేమ ప్రభుత్వమని , రైతులు ఆర్ధికంగా లాభసాటి గా ఉండేందుకు సబ్సిడీపై పవర్ ట్రిల్లర్లు అందిస్తున్నామని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.
శనివారం వాడపల్లి గ్రామంలో రెండు రైతు సహకార సంఘాలకు 15 పవర్ ట్రిల్లర్లు మంత్రి చేతుల మీదుగా అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రోజు నుంచే రైతుల, మహిళల, పేద, నిరుపేద ప్రజల పక్షాన్న సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. రైతులు ఆర్ధికంగా నిలబడితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నమ్మే నాయకుడు జగనన్న అన్నారు. రాష్ట్రంలో సంక్షేమం తో పాటు అభివృద్ధి కి సమాన ప్రాధాన్యత నివ్వడం జరుగుతోందని తెలిపారు. వాడపల్లి గ్రామ పంచాయతీ లో శ్రీ వినాయక, వెంకటేశ్వర కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ లకు 15 పవర్ ట్రిల్లర్లు సబ్సిడీ పై అందచేస్తున్నామన్నారు. యూనిట్ ఖరీదు రూ.1,86,000 లులో రైతు వాటా గా 10 శాతం రూ.18,600 , ప్రభుత్వ సబ్సిడీగా రూ.74.400 లు, బ్యాంకు ఋణం 50 శాతం రూ.93,000 అందించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. పంట కోసిన అనంతరం భూమి దుక్కడానికి, ఉద్యానవన పంటలు సాగు చేసే రైతులు అంతర్ పంటకు భూమిని దుక్కడానికి ఈ యంత్ర పరికరాలు ఎంతో ఉపయోగపడుతుందని వ్యవసాయ అధికారులు వివరించారు. రోజుకు 3 నుంచి 5 ఎకరాలు దుక్కడానికి వాడవొచ్చని, కనీసం పనులు ఉన్న రోజుల్లో ఏడాదికి రూ.లక్ష వరకు ఆదాయం వొస్తుందని, వీటిని రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు సరఫరా చేసేందుకు వాటి వివరాలు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ఈ యంత్రాల వల్ల భూములు ఒకే సమాంతరంలో చదును చేసుకోవచ్చు నని తెలిపారు.
కొవ్వూరు ఎంపిపి కాకర్ల నారాయుడు, జడ్పిటిసి బొంతా వెంకట లక్ష్మి, జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్ పోసిన శ్రీలేఖ, సర్పంచ్ గెల్లా ప్రసాద్, ఏఎంసి చైర్మన్ వల్లభశెట్టి శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ ఏ డి పి.చంద్రశేఖర్, మండల వ్యవసాయ అధికారి కె.వేణుగోపాల్ కృష్ణ, , పలువురు సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతు లు, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment