కొవ్వూరు (ప్రజా అమరావతి);
కొవ్వూరు 1వ వార్డులో శ్రీరామ కాలనీలో జ్వరాలతో బాధపడు తున్న బాధితులను పరామర్శించి మెరుగైయిన వైద్య సేవలు అందిం చే విధంగా చర్యలు
తీసుకోవాలని వైద్యులను ఆదేశించడం జరిగిందని రాష్ట్ర స్త్రీ శిశు సం క్షేమ శాఖ మంత్రి డా.తానేటి వనిత పేర్కొన్నారు.
మంగళవారం మంత్రి శ్రీరామ్ కాలనీ లో బాధితులను పరామర్శిం చి, అనంతరం ప్రభుత్వానికి ఆసుప త్రిలో చికిత్స పొందుతున్న భాదితు లతో మాట్లాడి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, శ్రీరామ్ కాలనీలో కొందరు జ్వరాలతో, తీవ్ర కాళ్ళ నొప్పుల ( జాయింట్ పేయిన్స్ ) సమస్య తో బాధపడుతున్నట్లు తన దృష్టికి వొచ్చిన వెంటనే సీఎం వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనవలసిఉన్నా హుటాహుటిన ఇక్కడి కి వొచ్చి బాధితులను పరామర్శించి భరోసా కల్పించామన్నారు. బాధితుల తో స్వయంగా మాట్లాడామని, రాత్రి నుంచి కొందరి కి తీవ్ర జ్వరం వొచ్చి, తరువాత తీవ్రంగా జాయింట్ నొప్పులు, కళ్ళు తిరగడం వంటి లక్షణాలు వున్నట్లు పేర్కొన్నారన్నా రు. డాక్టర్ లతో మాట్లాడి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు.అసలు జ్వరానికి కారణం విశ్లేషణ చేస్తున్నామని మాములు జ్వరాల, డెంగ్యూ నా, మలేరియా నా అనేదానిపై దృష్టి పెట్టామని తెలిపారు. డెంగ్యూ పరీక్ష లు (ప్లేట్ లెట్స్ కౌంట్) ఇక్కడి ఆర్బన్ హెల్త్ సెంటర్ లో ఉందని, జిల్లా కలెక్టర్, వైద్య అధికారులతో సమీక్షించి హెల్త్ సెంటర్ కి పంపి పరీక్షలు చెయ్యడమా, లేక ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు జరిపే దానిపై చర్యలు తీసుకుంటామన్నారు. భాదితుల నుంచి రక్త నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని మంత్రి తానేటి వనిత తెలిపారు. ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తో కూడా ఈ విషయంపై మాట్లాడి మన ప్రభుత్వ ఆసుపత్రిలో నే మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు.
అంతకుముందు మంత్రి తానేటి వనిత చొరవ తో రెండు అంబులెన్స్ లను పంపి బాధితులను ఆసుపత్రి కి తరలించారు. ప్రస్తుతం ఆరుగురి కి వైద్య సేవలు అందిస్తున్నామని, వారి ఆరోగ్యం స్థిరంగా ఉంది.
మంత్రి వెంట కొవ్వురు ఛైర్ పర్సన్ బావన రత్నకుమారి, ఆర్డీఓ ఎస్. మల్లిబాబు, డిప్యూటీ డి. ఎం. హెచ్ ఓ, పి. రామగురు రెడ్డి, మునిసిపల్ కమీషనర్, కె. టి. సుధాకర్, వైద్య నిపు ణులు, ఎస్. ధర్మరాజు, బి. శ్రీనివాస్, కౌన్సిలర్ లు, బొండాడ సత్యనారాయణ, అక్షయ పాత్ర శ్రీనివాస్ రవీంద్ర, ఆర్. భాస్కర రావు, కె. రమేష్, స్థానిక ప్రజాప్ర తినిధులు, తదితరులు పాల్గొ న్నారు.
addComments
Post a Comment