తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మ వారిని దర్శించుకున్న గౌ. భారత సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి.
ప్రజలందరికీ దసరా పండుగశుభాకాంక్షలు : . భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ మూర్తి.
తిరుపతి, అక్టోబర్ 14 (ప్రజా అమరావతి): ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యవంతులుగా ఉండాలని గౌ. భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ జస్టిస్ ఎన్.వి.రమణ గారు పేర్కొన్నారు.
రెండు రోజుల జిల్లా పర్యటన లో భాగంగా జిల్లాకు విచ్చేసిన గౌ. భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గురువారం సాయంత్రం 4 గంటలకు తిరుచా నూరు శ్రీ పద్మావతీ అమ్మ వారి దర్శనార్థం విచ్చేసిన గౌ.భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి టిటిడి అధికారులు, వేద పండితులు సాంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికి అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు.. మొదట ధ్వజ స్తంభా నికి నమస్కారం చేసి తరువాత సన్నిధిలోని అమ్మ వారిని దర్శించు కున్నారు... ఆలయ ఆశీర్వచన మండపంలో వేదపండితుల ఆశీర్వాదంతో తీర్థ ప్రసాదాలు అంద జేశారు..
అనంతరం గౌ.భారత ప్రధాన న్యాయమూర్తి ఆలయం వెలుపల విలేఖరులతో మాట్లాడుతూ ప్రజలందరికీ దసరా పండుగ సంధర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
గౌ.భారత ప్రధాన న్యాయమూర్తి వెంట
ఆంద్ర ప్రదేశ్ హైకోర్టు గౌ.ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, హై కోర్ట్ జడ్జిలు శ్రీ జస్టిస్ ఎం.సత్య నారా యణమూర్తి, జస్టిస్ లలిత కనికంటి, హైకోర్ట్ రిజిస్ట్రార్ ఎ.గిరిధర్, హైకోర్ట్ రిజిస్ట్రార్ జనరల్ కె.బానుమతి, చిత్తూరు జిల్లా జడ్జి వై వీ ఎస్ డి జి పార్థ సారథి, టీటీడీ జె.ఈ.ఓ వి.వీరబ్రహ్మం,ఇతర సంబంధింత అధి కారులు కలరు..
addComments
Post a Comment