అల్ ఇండియా షూటింగ్ బాల్ లో బంగారు పతకం సాధించిన మారుతి ఫౌండేషన్ కి చెందిన ముగ్గురు బాలికలు*

 తాడేపల్లి (ప్రజా అమరావతి);


*అల్ ఇండియా షూటింగ్ బాల్ లో బంగారు పతకం సాధించిన మారుతి ఫౌండేషన్ కి చెందిన ముగ్గురు బాలికలు*మారుతి ఫౌండేషన్ సహకారంతో షూటింగ్ బాల్ లో కోచింగ్ తీసుకుని అల్ ఇండియా షూటింగ్ బాల్ కు ఆంధ్రప్రదేశ్ తరుపున పాల్గొన్నారు.


ఆంధ్రప్రదేశ్ బాలికల జట్టుకు ప్రాతినిధ్యం వహించి మొదటి స్థానం కైవసం చేసుకున్నారు.


ఈరోజు ఆంద్రప్రదేశ్ కు తిరిగి రావడంతో వారికి మారుతి ఫౌండేషన్ కార్యదర్శి జంగాల వెంకటేష్ అభినందనలు తెలిపారు.


మీడియా సమావేశంలో జంగాల వెంకటేష్ మాట్లాడుతూ మారుతీ ఫౌండేషన్ తరపున బంగారు పతకం సాధించడం ఎంతో సంతోషకరం...


5 సంవత్సరాల క్రితం స్థాపించిన మారుతి ఫౌండేషన్ తో ఎంతో మంది ప్రతిభవంతులకు సహకారం అందచేసాం అని తెలిపారు.


భవిష్యత్తులో కూడా మరింత మందికి మారుతి ఫౌండేషన్ తరుపున సహాయ సహకారాలు అందిస్తాం అని అన్నారు.


త్వరలోనే ఈ ముగ్గురు ఇండియా తరుపున జరిగే సెలెక్షన్ లో పాల్గొంటారు అని వారు ఇండియా తరుపున ఆడాలని ఆశాభావం వ్యక్తం చేశారు.