ఇంద్రకీలాద్రికి భారీగా తరలివచ్చిన భవాని భక్తులు ....విజయవాడ (ప్రజా అమరావతి);


ఇంద్రకీలాద్రికి భారీగా తరలివచ్చిన భవాని భక్తులు ....ఏర్పాట్లను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జె. నివాస్.......


కృష్ణావేణి ఘాట్, కేశఖండనశాల, లడ్డు ప్రసాదాల వంటశాలను పరిశీలించిన కలెక్టర్ ..


రెండు రోజుల పాటు కొండ పైకి ఎటువంటి వాహనాలకు అనుమతి లేదు.....దుర్గ గుడికి వచ్చే భవాని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా మౌలిక సదుపాయాల కల్పనలో

ప్రత్యక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

శనివారం ఉదయం ఆయన నగరంలోని సీతమ్మవారి పాదాల వద్ద కృష్ణావేణి ఘాట్ ను సందర్శించి,

అక్కడ ఉన్న లోటుపాట్లు గురించి భవాని భక్తులను అడిగి తెలుసుకున్నారు. శని, ఆదివారాల్లో దుర్గమ్మను దర్శించుకునే

భవానీల రద్దీని దృష్టిలో ఉంచుకుని అందుకు అవసరమైన ఏర్పాట్లను కలెక్టర్ జె. నివాస్ తనిఖీ చేశారు. కృష్ణావేణి ఘాట్ లో భవానీలు స్నానం అనంతరం విడిచి పెట్టిన దుస్తులను పరిశీలించిన పిమ్మట అక్కడ నుంచి ఎప్పటికప్పుడు

తీసివేసి ఘాట్ శుభ్రంగా వుంచాలని సంబంధిత అధికారులను సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం కేశఖండనశాలను సందర్శించి అక్కడ పరిస్థితులను పరిశీలించారు. కేశఖండనశాలలో వినియోగిస్తున్న బ్లేడులు,

ఇతర పరికరాలను పరిశీలించి వాటి శుభ్రత, శానిటేషన్ పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అక్కడ ఉన్న పర్యవేక్షణ అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. మరుగుదొడ్ల నిర్వహణ తీరును కలెక్టర్ పరిశీలించి మరింత

పరిశుభ్రంగా వుంచేందుకు అవసరమైన సూచనలు చేశారు. అక్కడ నుండి ప్రసాదాలు కౌంటర్ కు చేరుకుని లడ్డు

ప్రసాదాలు భక్తులకు అందిస్తున్న తీరును కలెక్టర్ జె. నివాస్ పరిశీలించారు. దుర్గమ్మ దర్శనం చేసుకున్న భక్తులకు

ఒక్కొక్కరికి 5 లడ్డుల చొప్పున మాత్రమే అందించాలన్నారు. ఈ ప్రసాదాలు భక్తులకు అందించడంలో వేగం పెంచడానికి సంబంధింత సిబ్బంది కృషి చేయాలన్నారు. అనంతరం ప్రసాదాల తయారీ వంటశాలను కలెక్టర్ జె. నివాస్

సందర్శించారు. ప్రసాదాల తయారీలో ముఖ్యంగా శుభ్రత, నాణ్యత లడ్డు తయారీలో పాటించాలన్నారు. ఏ విషయంలో ను భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ జె.

నివాస్ సూచించారు.


కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఎల్. శివశంకర్, విజయవాడ సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్, సియంఓహెచ్ డా. గీతాబాయి తదితరులు ఉన్నారు.