మహిళలు ఆర్ధికంగా నిలబడితే ఆ ఇల్లు, గ్రామం, జిల్లా, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనితణుకు (రేలంగి)  (ప్రజా అమరావతి);"మహిళలు ఆర్ధికంగా నిలబడితే ఆ ఇల్లు, గ్రామం, జిల్లా, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని


నమ్మిన వ్యక్తి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని జిల్లా పరిషత్ ఛైర్మన్ కె. శ్రీనివాస్ పేర్కొన్నారు.


బుధవారం ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో జెడ్పి హై స్కూల్ లో ఏర్పాటు చేసిన  వైఎస్సార్ ఆసరా రెండో విడత చెక్కులు పంపిణీ కార్యక్రమానికి స్థానిక శాసన సభ్యులు డా.కారుమురి నాగేశ్వరరావు తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పి చైర్మన్ మాట్లాడుతూ, ఇచ్చిన మాటకు కట్టుబడి న వ్యక్తిగా చరిత్రలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి స్థానం ఉంటుందన్నారు. మహిళలు ఆర్ధికంగా నిలబడాలన్నదే సీఎం అసాయమన్నారు. రాష్ట్రం ఆర్ధికంగా ఇబ్బందులలో ఉన్నా సంక్షేమ కార్యక్రమాలు నిరాఘాటంగా అమలు చేస్తున్నారన్నారు.


శాసనసభ్యులు కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి సంక్షేమం తో పాటు అభివృద్ధి కి కూడా ఈ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. గత ప్రభుత్వం హయాంలో రేలంగి గ్రామంలో 5 సంవత్సరాల కాలంలో రూ.10 కోట్ల 96 లక్షలు సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కోసం ఖర్చు చేశారన్నారు. మన జగనన్న ప్రభుత్వం ఆధ్వర్యంలో కేవలం 29 నెలల కాలంలో రూ.48 కోట్ల 83 లక్షలు ఖర్చు చేశామన్నారు. కరోనా సమయంలో కూడా వెనకడుగు వెయ్యకుండా అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వం లో యువతకు పెద్దపీట వెయ్యడం జరుగుతోందని, అందుకు నిదర్శనం కవురు శ్రీనివాస్ మన జిల్లాకు జెడ్పి ఛైర్మన్ గా నియమించడం అన్నారు . అనంతరం ఛైర్మన్ శ్రీనివాస్ ను సత్కరించారు.


ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి అంజిబాబు, శెట్టిబలిజి కార్పొరేషన్ చైర్మన్ బి. తమ్మాయ్య, ఎంపిటిసి కిరణ్మయి, వైస్ ప్రెసిడెంట్ అక్కమాంబ, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.Comments