కులదృవీకరణ పత్రంపై వివాదం

 తాడేపల్లి (ప్రజా అమరావతి);


దుగ్గిరాల మండలం చిలువూరు ఎంపీటీసీ అభ్యర్థి జబీన్ కులదృవీకరణ పత్రంపై వివాదం


మరింత ముదురుతోంది.* 


చివరకు కలెక్టర్ సైతం రాజకీయ ఒత్తిడికి స్థానిక ఎమ్మెల్యే ఆర్కే గురైనట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.


రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎంపీపీ, జెడ్పీ పీఠంపై అన్ని చోట్ల దాదాపు పూర్తి అయ్యాయి. 


కానీ ముఖ్యమంత్రి నివాసం ఉంటున్న గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఎన్నికలు జరిగిన ఏకైక మండలం దుగ్గిరాల మండలం. 


దానిలో 18 స్థానాల్లో ఎన్నికలు జరగగా 4 ఎకగ్రీవం వైసీపీ అవగా మిగిలిన వాటిలో ప్రతిపక్షా పార్టీ టీడీపీ 9 , జనసేన 1, మిగిలిన 8 స్థానాల్లో అధికార వైసీపీ గెలుపొందారు.


అయితే పెదకొండురో తొలిత జనసేన అభ్యర్థి గెలిచారు అంటు ప్రచారం చేసో అనంతరం రీ కౌంటింగ్ పేరుతో ఆ స్థానంను కూడా తమ అధికార బలంతో తమ ఖాతాలో జమ చేసుకున్నారు.


ఇంత వరకు ఒక ఎత్తు అసలు సమస్య ఇక్కడే మొదలైంది.


తాజాగా బలం ఉన్న టీడీపీ జనసేన అభ్యర్థి తో దుగ్గిరాల ఎంపీపీ పీఠం కోసం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేవకున్న సమయంలో అభ్యర్థికి బీసీ కులదృవీకరణ పత్రం కావాలని గ్రామ సచివాలయంలో ఆర్జీ పెట్టుకున్న తర్వాత అసలు ఆట అధికార పార్టీ ఎమ్మెల్యే అధికారులతో ప్రారంభించారు.


అనేక మలుపులు కోర్టు, కలెక్టర్, తాశీల్ధార్ ఇలా పలు ప్రాంతాల చూట్టు తిరిగి చివరకు కోర్టు కలెక్టర్ ను కులదృవీకరణ పత్రంపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. 


ఇక్కడ టీడీపీ వారికి చేదు అనుభవం ఎదురైంది. అక్కడ కూడా కలెక్టర్ ను ఎమ్మెల్యే ఆర్కేప్రభావితం చేశారంటు టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. 


ఇక్కడ ఒక్క ఎంపీపీని అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు దీనికి ఓకే కానీ రాష్ట్రంలో ఉన్న మైనారిటీ సోదర సోదరిమణులందరు ఈ ఘటనపై రాబోయే రోజుల్లో మరింత సమస్యలు రాబోతోందా అంటు సరికొత్త నినాదం చేస్తున్నారు.


_"ఇందులో భాగంగా నేడు టీడీపీ తాడేపల్లి పట్టణ పార్టీ కార్యలయంలో అద్యక్షుడు జంగాల సాంబశివరావు మైనారిటీ లకు సంబంధించిన పలు జీఓలకు వారి కులదృవీకరణ పత్రంకు సంబంధించిన వివరాలు తెలియజేశారు_." 


దీనిపై కలెక్టర్ నివేదికను సైతం సవాల్ చేస్తూ కోర్టు ను అశ్రయిచ్చేందుకు సిద్దం అని తెలిపారు. 


అధికారులు ఏ పార్టీ కి కొమ్ము కాయకుడదని రాజకీయ పార్టీలు మారుతుంటాయంటు వారి మాటలతో జీఓలను మారిస్తే తగిన మూల్యం తప్పదని హెచ్చరించారు.