తాళ్లపూడి (వేగేశ్వరం) (ప్రజా అమరావతి);
మహిళలు జగనన్న పై నమ్మకం తో 151 స్థానాల్లో గెలిపించి ముఖ్యమంత్రి ని చేసారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటు సంక్షేమ పథకాలు మహిళలు పేరునే అందించడం
జరుగుతోందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.
శనివారం తాళ్లపూడి మండలం తిరుగుడుమెట్ట, వేగేశ్వరపురం, బల్లిపాడు తదితర గ్రామాల్లో వైఎస్సార్ ఆసరా రెండో విడత చెక్కులు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, మీ కుటుంబాల కు మహిళ లే కుటుంబ యజమానులు గా, ప్రధాన ఆధారంగా ఉండాలని, మహిళా సాధికారత దిశగా అడుగులు వెయ్యలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయమన్నారు.
వైఎస్సార్ ఆసరా రెండో విడత సంబరాలు దసరా పండుగ రోజుల్లో అందచేసే క్రమంలో మీ ఆనందాన్ని పంచుకొంటూ ఈ వేడుకలు మీ మధ్య జరుపుకుంటున్నామన్నారు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు మీమీ కుటుంబాల ఆర్ధిక అభివృద్ధి కి వినియోగించుకొవాలని కోరారు. తండ్రికి తగ్గ తనయుడిగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక అడుగు వేస్తే తాను రెండడుగులు వేస్తూ, జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతోందన్నారు. .
తాళ్లపూడి మండలం లో వైఎస్సార్ ఆసరా రెండో విడతగా తిరుగుడు మెట్ట లోని 138 గ్రూపుల్లోని 874 మందికి రూ.52.92 లక్షలు, ; పెద్దేవం 138 గ్రూపుల 1352 మందికి రూ.106.58 లక్షలు; వేగేశ్వరపురం 114 గ్రూపుల 1129 మందికి రూ. 119.28 లక్షలు, ; బల్లిపాడు 32 గ్రూపు ల్లోని 311 మందికి రూ.27.62 లక్షలు; మలకపల్లి 127 గ్రూపుల్లోని 1254 మందికి రూ.96.91 లక్ష లు లబ్దిదారుల ఖాతాలో జమ చేశామన్నారు. వైఎస్సార్ ఆసరా రెండో విడత మొత్తాలను లబ్దిదారుల ఖాతాకు చెల్లింపు చేస్తున్న ట్లు తెలిపారు.
శని, ఆదివారాలు బ్యాంకులకు సెలవుల నేపథ్యంలో ఆసరా సొమ్ము ముందుగానే శుక్రవారం ఆమొత్తాన్ని మీ బ్యాంకు కి జమ చేసామని తెలిపారు.
కార్యక్రమంలో తాళ్లపూడి జెడ్పిటిసి/ జిల్లా వైస్ ఛైర్మన్ పోసిన శ్రీలేఖ, ఎంపిపి జొన్నకూటి పోసిరాజు, గజ్జరం ఎంపీటీసీ గుంటు చిన్నాబ్బాయి, తాళ్లపూడి మండల ఎఎంసి వి.శ్రీహరి, స్థానిక నాయకులు పోసిన శ్రీకృష్ణ దేవరాయలు, తాహసీల్దార్ శాంతి, ఎంపీడీఓ రాజశేఖర్, సర్పంచ్ లు, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment