రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానే టి వనిత చేతులు మీదగా *పోలీస్* ఆల్బమ్ ను రిలీజ్ చేసారు,

 --తాడేపల్లిగూడెం/కొవ్వూరు (ప్రజా అమరావతి);
రాష్ట్ర  స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానే టి వనిత చేతులు మీదగా  *పోలీస్* ఆల్బమ్ ను రిలీజ్ చేసారు,
ప, గో జిల్లా తాడేపల్లిగూడెం మంగళవారం  పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఆధ్వర్యంలో రాష్ట్ర  స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానే టి వనిత చేతులు మీదగా నాగరాజు కంపోస్ చేసిన *పోలీస్* ఆల్బమ్ ను రిలీజ్ చేసారు. ఈ కార్యక్రమం లో డాక్టర్ తానేటి శ్రీనివాస్, కొవ్వూరు డిఎస్పీ   శ్రీ నాథ్ , సర్కిల్ ఇన్స్పెక్టర్  లు  , తదితరులు పాల్గొన్నారు. 


అక్టోబర్‌ 21, అంటే పోలీసు అమరవీరుల దినం. 1959 చైనా దురాక్రమణను భారత సైన్యం సమర్థంగా తిప్పిగొట్టిన రోజు ఇది. ఈ సమరంలో ఎంతోమంది సైనికులు అమరులయ్యారు. ఆ రోజును పురస్కరించుకుంటూ, విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్‌ యోధుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి ఏడాది వారి కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకుంటూ, వారి సేవలను స్మరించు కోవడం జరుగుతుంది.

Comments